కొత్త ఆరంభం అంటూ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు..!?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి ఎలాంటి గుర్తింపు ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే ఉపాసన నెట్టింట్లో చేసే కార్యక్రమాలు, ఆరోగ్య పరిరక్షణ మీద అవగాహన కోసం చేసే వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.ఇక కరోనా ఇంకా మన దేశంలోకి రాక ముందే.. ఉపాసన అందరినీ హెచ్చరించింది. కానీ ఇక  అప్పుడు దాన్ని ఎవ్వరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాగా కరోనా వస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని కూడా శాస్త్రీయ పద్దతిలో చెప్పింది.

ఇకపోతే అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు నిర్వహిస్తూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఉపాసన.అయితే  ఇక ఆమె చెప్పే చిట్కాలు, ఆరోగ్యకరమైన ఆహార తయారీ విధానం, పోషకాహారానికి సంబంధించిన విశేషాలు పంచుకుంటూ ఉంటుంది.అయితే  ఆ మధ్య యువర్ లైఫ్ అనే మ్యాగజైన్, వెబ్ సైట్‌ను ఉపాసన ప్రారంభించింది. దాంట్లో సమంతను కూడా భాగస్వామిగా చేసుకుంది.అయితే హెల్తీ ఫుడ్ గురించి సమంతతో కలిసి ఓ వీడియోను కూడా చేసింది ఉపాసన.కాగా  సమంత చేసిన స్పెషల్ ఇడ్లీల గురించి ఉపాసన ఓ పోస్ట్ కూడా వేసింది.

ఇక  అలా ఆ యువర్ లైఫ్ కోసం ఇప్పుడు ఓ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారట. ఇకపోతే కొత్త ఆరంభం అంటూ ఉపాసన యువర్ లైఫ్ ఆఫీస్ గురించి పోస్ట్ వేసింది. రామ్ చరణ్‌ బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి స్పందిస్తూ.. న్యూ బిగినింగ్ అని పోస్ట్ చేసింది.ఇదిలావుండగా రామ్ చరణ్ కియారా అద్వాణీలు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.ఇక  rc 15 సాంగ్ షూటింగ్ కోసం శంకర్ అండ్ టీం అక్కడకు వెళ్లింది. అయితే దాదాపు ఓ పది రోజులు అక్కడే షూటింగ్ జరగబోతోన్నట్టుగా తెలుస్తోంది.ఇక  ఈ సాంగ్ షూట్ తరువాత మళ్లీ శంకర్ తన ఇండియన్ 2 పనులతో బిజీగా ఉంటాడు. ఇకపోతే రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టే చాన్స్ కూడా ఉంది.ఇలా ఇప్పుడు రామ్ చరణ్‌తో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లలేకపోవడంపై ఉపాసన చాలా బాధపడుతున్నట్టుగా ఉంది. ఇక మిస్ యూ అంటూ కియారా పోస్ట్‌కు ఉపాసన రిప్లై ఇచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: