స్టార్ హీరోయిన్ కావడం కోసం అలాంటి పనులు చేస్తున్న శ్రీలీల ..!?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది యంగ్ బ్యూటీ శ్రీలీల.రోషన్ సరసన పెళ్లి సందడి సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా అరంగేట్రం చేసి.. మొదటి సినిమాతోనే...తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని వరుస అవకాశాలను దక్కించుకుంటుందిరవితేజకు జోడీగా శ్రీలీల నటించిన ధమాకా సినిమా డిసెంబర్ నెలలో థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాతో శ్రీలీల మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇకపోతే మహేష్ త్రివిక్రమ్ కాంబోలో శ్రీలీల మరో హీరోయిన్ గా ఎంపికైందనే సంగతి తెలిసిందే. అయితే ఇక  బన్నీకి జోడీగా నటించాలని శ్రీలీల ఆశ పడుతున్నారని సమాచారం అందుతోంది.

అంతేకాదు ప్రస్తుతం బన్నీకి జోడీగా ఒక యాడ్ షూట్ లో పాల్గొంటున్న శ్రీలీల రాబోయే రోజుల్లో బన్నీకి జోడీగా సినిమాల్లో కూడా నటించాలని భావిస్తున్నారు.అయితే  బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటించనున్నారు.ఇకపోతే  స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఆఫర్ వచ్చినా ఆ ఆఫర్ ను శ్రీలీల వదులుకోవడం లేదు. అయితే స్టార్ హీరోయిన్ కావడం కోసం శ్రీలీల ఈ విధంగా చేస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు.అయితే శ్రీలీల ఒక్కో ప్రాజెక్ట్ కు కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

ఇకపోతే  ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే శ్రీలీల రెమ్యునరేషన్ 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అయితే నటిగా శ్రీలీల ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. ఇక శ్రీలీల డ్యాన్స్ లు కూడా పేక్షకుల మెప్పు పొందుతుండటంతో శ్రీలీల నటించిన సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.అంతేకాదు ధమాకా సినిమాకు ఏకంగా 30 కోట్ల రూపాయల బిజినెస్ జరగడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.ఇక  శ్రీలీల ఇతర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుండటంతో పాటు ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా శ్రీలీలకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: