ఘనంగా విష్ణు విశాల్ మట్టి కుస్తీ తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..!

Divya
తమిళ్ యంగ్ హీరో విష్ణు విశాల్ నటించిన తాజా చిత్రం మట్టి కుస్తీ .. దీనిని తమిళ్ గట్ట కుస్తీ గా.. తెలుగులో మట్టి కుస్తీ పేరిట విడుదల చేస్తున్నారు. అటు తమిళం తో పాటు తెలుగులో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. స్పోర్ట్స్ డ్రామాగా దర్శకుడు చల్ల అయ్యవు డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ కావడంతో పాటు ఈ చిత్ర డిజిటల్ రైట్స్ కి కూడా మంచి క్రేజ్ లభించింది. తాజాగా ఒక ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ మంచి ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. థియేటర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటిటి ప్లాట్ఫామ్ తాజాగా వెల్లడించింది.
అయితే ఈ సినిమాను విష్ణు విశాల్ కి చెందిన విష్ణు విశాల్ స్టూడియోస్ అలాగే రవితేజకు చెందిన ఆర్టీ టీం వర్క్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేసిన చిత్ర యూనిట్ ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని విష్ణు విశాల్ తన అభిప్రాయంగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం హైదరాబాదులోని ప్రముఖ ఏ ఎం బి మాల్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించగా..  ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కోసం నిర్వహించిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో విష్ణు విశాల్ ,హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పాల్గొని ఈ సినిమాలోని ఒక పాటకు స్టెప్పులు కూడా వేశారు.

అనంతరం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తమిళ్ లో చెన్నైలో 29 నవంబర్ న చాలా గ్రాండ్ గా నిర్వహిస్తామని ప్రకటించాడు . మరి ఈరోజు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నై లో జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: