తమన్నా ఆ సినిమాని పట్టించుకోలేదా..?

Divya
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో ప్రదర్శించి పలు విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో తక్కువగా నటిస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తుందా శీతాకాలం సినిమా ఒక్కటే త్వరలోనే విడుదల కాబోతోంది. ఇందులో హీరోగా సత్యదేవ్ నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం నాగశేకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఒక రొమాంటిక్ కథ చిత్రంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది .ఇందులో మేఘ ఆకాష్, కావ్య శెట్టి అని మరో ఇద్దరి హీరోయిన్లు కూడా నటిస్తున్నారు.

కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టైల్ అనే  చిత్రాన్ని  ఈ సినిమాని గుర్తుందా సీతాకాలం చిత్రంగా రీమిక్స్ చేయడం జరిగింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. కాకపోతే అప్పుడెప్పుడో థియేటర్లో రావాల్సిన ఈ చిత్రం పలు కారణాల చేత ఆలస్యం కావడంతో అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది డిసెంబర్ 9వ తేదీన భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
దీంతో చిత్ర బృందం తాజాగా ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలోని మహిళా ప్రధాన పాత్రలు ఎవరూ కూడా పెద్దగా కనిపించలేదు. గుర్తుందా శీతాకాలం విలేకరుల సమావేశానికి హీరో సత్య మరియు నటుడు ప్రియదర్శితోపాటు చిత్ర దర్శక నిర్మాతలు హాజరయ్యారు. తమన్నా మాత్రం ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనలేదు. దీంతో పలువురు నెటిజన్ల సైతం అసలు తమన్నాకు ఈ చిత్రం గుర్తుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు వాస్తవానికి గుర్తుందా శీతాకాలం సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత తమన్న తన సోషల్ మీడియా ప్లాట్ఫారంలో కనీసం అనౌన్స్మెంట్ పోస్టర్ను కూడా చేయలేదు. మరి తమన్న ఇతర కారణాల వల్ల ఈ సినిమా ప్రమోట్ చేయడం లేదా మరి ఇతర కారణాల చేత లైట్ తీసుకుందామని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: