గత బ్రేకప్ నుండి ఇంకా కోలుకోలేదు... టాలీవుడ్ యంగ్ హీరోయిన్..!

Pulgam Srinivas
యంగ్ బ్యూటీ సునైనా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే పలు తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకుంది. యంగ్ బ్యూటీ సునైనా "కుమారి వర్సెస్ కుమారి" మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించక పోవడంతో ఈ ముద్దు గుమ్మ కు ఈ మూవీ ద్వారా పెద్దగా గుర్తింపు లభించలేదు. కుమారి వర్సెస్ కుమారి సినిమా తర్వాత సునైనా , శ్రీ విష్ణు హీరో గా తెరకెక్కిన రాజ రాజ చోరా మూవీ లో శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన రాజ రాజ చోరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో సునైనా కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. అలాగే రాజ రాజ చోరా మూవీ లోని సునైనా నటన కు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.


ఇది ఇలా ఉంటే తాజాగా సునైనా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తన ఫ్యాన్స్ కు అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తాజాగా సునైన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఈ ముద్దు గుమ్మ కు ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈ ముద్దు గుమ్మ సమాధానం ఇస్తూ ... ముందు నన్ను గత బ్రేకప్ నుండి కోలుకోనివ్వండి అని సమాధానం ఇచ్చింది. మరో నెటిజన్ కష్ట సమయంలో ఉపసమానం కోసం మీరు ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు. దానితో ఈ ముద్దు గుమ్మ బుక్స్ చదువుతుంటా , దాని వల్ల రిలీఫ్ వస్తుంది అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: