ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలను చేసుకుంటూ వెళ్లే టాలీవుడ్ హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు.ఇక ఆరు పదుల వయసులోనూ అస్సలు వెనక్కి తగ్గని ఆయన..రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు.ఇక ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన 'అఖండ' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే అప్పటి నుంచి మరింత జోష్‌తో బాలయ్య ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇక ఇలా ఇప్పుడు ఆయన 'వీరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
ఇకపోతే అఖండ' వంటి భారీ హిట్ తర్వాత నటసింహా బాలకృష్ణ రెట్టించిన జోష్‌తో కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు.ఇక ఇందులో 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం 'వీరసింహారెడ్డి' అనే ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ క్రేజీ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే దీంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.ఇక. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం అనంతపురం ఏరియాలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన అంశం లీక్ అయింది.
ఇక సాధారణంగా బాలకృష్ణ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అయితే అందుకు అనుగుణంగానే 'వీరసింహారెడ్డి' మూవీలో కూడా ఈ విభాగమే హైలైట్ కాబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఈ సినిమాలో ఏకంగా 11 ఫైట్లు ఉంటాయని, వీటిని స్టన్ శివ నేతృత్వంలోని టీమ్ డిజైన్ చేసిందని తెలిసింది. ఇక ఈ సినిమాలోని ఫైట్ సీన్లే దాదాపు గంట వరకూ ఉంటాయని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీంతో ఇప్పుడీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా రెట్టింపు అయిపోయాయి.ఇకపోతే నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు..!!