ధర్మచక్రం వంటి అద్భుత సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది ఒకప్పటి అందాల తార ప్రేమ. ఇక భక్తి సినిమాలతో ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రేమ గ్లామర్ పాత్రలు కూడా చేసింది.అయితే ఉపేంద్ర 'రా' చిత్రంలో ప్రేమ బోల్డ్ సీన్స్ నేటికీ మర్చిపోలేం.ఇక ఇలా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ఒకప్పటి అందాల తార ప్రేమ హీరోయిన్ కెరీర్ ని మార్చేసిన చిత్రం చిరునవ్వుతో కథ అందించటమే కాకుండా చిరునవ్వుతో చిత్రానికి కర్త కర్మ క్రియ అంతా త్రివిక్రమ్ అంటారు. ఇక హీరో వేణుతో ఉన్న అనుబంధంతో చిరునవ్వుతో కాస్టింగ్ అంతా త్రివిక్రమ్ దెగ్గరుండీ చూసుకున్నారట.
అయితే ఇక వేణు కెరీర్ మలుపుతిప్పిన ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించింది హీరోయిన్ ఒకప్పటి అందాల తార ప్రేమ .కాగా వేణు మరదలి పాత్ర అది. వంటవాడైన హీరో వేణుతో పెళ్లి ఇష్టం లేని ప్రేమ లేచిపోయి మోసపోతుంది.ఇకపోతే మొదట ఇది కూడా హీరోయిన్ పాత్రనే అని ప్రేమకి చెప్పి ఒప్పించారట.అయితే అప్పటికి తాను హీరోయిన్ గా చేస్తున్నా కదా వద్దు అంటే ఇది కూడా హీరోయిన్ రేంజున్న పాత్రే అని కన్విన్స్ చేశారట. ఇక దాంతో రైటర్ త్రివిక్రమ్ పై నమ్మకంతో.. పాత్రకి న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో చిరునవ్వుతో సినిమా చేశానని చెప్పింది
ఒకప్పటి అందాల తార ప్రేమ . అయితే ఇక సినిమా విడుదలయ్యాక ఆ పాత్ర కాస్త సహాయనటి పాత్ర అయిపోయిందని..షూటింగ్ కి ముందు నాకు ఒకలా చెప్పి.. ఇంకోలా చిత్రీకరించి మోసం చేశారని ఆరోపించింది. చిరునవ్వుతో తరువాత నాకన్ని సహాయనటి పాత్రలే వచ్చాయని.ఇకపోతే హీరోయిన్ గా నా కెరీర్ అక్కడితో ఎండ్ అయిపోయిందని వాపోయింది ఒకప్పటి అందాల తార ప్రేమ . అయితే ఇక చిరునవ్వుతోలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని, సెంటిమెంట్, సాంగ్ అన్ని బాగా కుదిరాయని.. ఆ పాత్ర చాలామందికి నచ్చిందని చెప్పుకొచ్చింది ఒకప్పటి అందాల తార ప్రేమ ..!!