టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో భారీ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు తాత్కాలికంగా #RC15 టైటిల్ ఫిక్స్ చేశారు.కాగా ఆర్ఆర్ఆర్ తరువాత చెర్రీ గ్యాప్ లేకుండా ఈ సినిమా చేస్తున్నారు. ఇక ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఇందులో కనిపిస్తారు.ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ స్టిల్స్ లీకయ్యాయి. ఇందులో రామ్ సంప్రదాయ దుస్తులు ధరించి సైకిల్ పై వెళ్తున్నాడు. అయితే సాధారణంగా శంకర్ సినిమా అంటే మామూలు బడ్జెట్ కు అస్సలు ఒప్పుకోడు.
అయితే లేటుస్టుగా ఈయన ఓ పాట కోసం ప్రత్యేకంగా సెట్ వేయించాడు. ఇక ఆ ఒక్క పాట కోసం రూ.15 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది.ఇకపోతే తమిళ డైరెక్టర్ శంకర్ సినిమా రేంజ్ వేరు ఉంటుంది.అయితే ప్రతీ సీన్ కచ్చితంగా బాగుండాలని కోరుకుంటాడు. అందుకే ఇక ఎంత ఖర్చయినా కాంప్రమైజ్ కాలేడు. అలాంటి నిర్మాతలే శంకర్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతారు. కాగా ఆయన చేతిలో ప్రస్తుతం కమలాసన్ తో తీసే భారతీయుడు -2 ఉన్నా ప్రధానంగా చెర్రీ సినిమాపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అయితే ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రకటించి వరుసగా షూటింగ్ చేస్తున్నారు.
ఇదిలావుంటే ఈ సినిమాను ఇప్పటికే తెలుగు హక్కుల కోసం దిల్ రాజుకు రూ.200 కోట్లకు అమ్మినట్లు టాక్. సినిమా టోటల్ బడ్జెట్ ఎంతో ఊహకే వదిలేయాలి. ఇక ఈ నేపథ్యంలో శంకర్ తెలుగులో తీస్తున్న తన ఫస్ట్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. అంతేకాదు ఇందుకోసం లేటెస్టుగా ఓ సౌత్ ఇండియన్ సాంగ్ రూపొందించబోతున్నాడు. దక్షిణ భారతీయులకు నచ్చేలా ఈ సాంగ్ ఉంటుందని సమాచారం.కాగా ఈ ఒక్క పాట కోసం రూ.15 కోట్లు పెడుతున్నట్లు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.ఇక తాను అనుకున్న పాటకు అనుగుణంగా ప్రత్యేకంగా సెట్ వేయించారట. అయితే ఈ సాంగ్ ను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 3 వరకు చిత్రీకరించనున్నారు. ఇకపోతే దాదాపు 12 రోజుల పాటు నిర్విరామంగా ఈ సాంగ్ ను షూట్ చేస్తారట. అందుకే ఈ ఒక్క సాంగ్ కోసం ప్రత్యేకంగా రూ.15 కోట్లు కేటాయించారని తెలుస్తోంది..!!