వేలకోట్ల ఆస్తిని వారి పేరు మీద రాసిన కృష్ణ..ఒక్క రూపాయి కూడా మహేష్ బాబుకు లేదట..!!

Anilkumar
కృష్ణ గారు నిన్న తెల్లవారుజామున మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన తేనెమనసులు అనే సినిమా ద్వారా మొదటిసారి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే మంచి హిట్ని తన ఖాతాలో వేసుకోవడంతో వరుస సినిమాల్లో ఆయన ఆఫర్లు వచ్చాయి. ఈయన రాకతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త శకం మొదలైంది అని చాలామంది చెప్పుకున్నారు.అయితే ఆ తర్వాత జయాపజయాలతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ కృష్ణ వరుస సినిమాల్లో నటించారు. ఇదిలావుంటే ఇక దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ ఆస్తులు మాత్రం కూడబెట్టుకోలేకపోయారు. 

అయితే ఇక  ఈయన వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్నప్పటికీ ఆయన వాటిని కేవలం తనకున్న వ్యసనాల కారణంగా ఖర్చు చేశారని తెలుస్తోంది. అప్పట్లో కృష్ణ మంచి రెమ్యూనరేషన్ తీసుకునేవాడు.ఇకపోతే వచ్చిన డబ్బంతా వ్యసనాల కారణంగా ఖర్చు కావడంతో కేవలం 400 కోట్ల ఆస్తులు మాత్రమే కృష్ణకు మిగిలాయట. అయితే ఇక  ఆయన ఆస్తి మొత్తం కొడుకులకు చెందుతుంది అంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక  సూపర్ స్టార్ కృష్ణ రాసుకున్న వీలునామా ప్రకారం తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం తన మనవళ్లు, మనవరాళ్లకే చెందాలని ఆయన వీలునామా రాసుకున్నారట.

ఈయన ఆస్తిలో ఒక్క రూపాయి కూడా మహేష్ బాబుకి చెందదట.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇకపోతే  ఏది ఏమైనప్పటికీ ఘట్టమనేని ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడం ఇటు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు. అయితే  ఒకే ఒక్క సంవత్సరంలో మహేష్ బాబు అన్నని, అమ్మని,తండ్రిని కోల్పోవడం చూసిన జనాలు ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అనుకుంటున్నారు.చిత్ర పరిశ్రమ కృష్ణ మరణంతో తీవ్ర దుఃఖంలో నిండిపోయింది. టాలీవుడ్ చిత్ర సీమకు మూల స్తంభం గా ఉన్నటువంటి హీరో కృష్ణ తుదిశ్వాస విడవడం ఆయన అభిమానులతో పాటు మహేష్ బాబు కుటుంబానికి కూడా తీరని లోటు అనే చెప్పాలి...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: