ఎమోషనల్ వీడియోని షేర్ చేసిన సదా.. వారికేనా..?

Divya
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ సదా. మొదట డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన జయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో భారీగానే అవకాశాలు సంపాదించింది.వరుసగా స్టార్ హీరోల తరపున నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. సదా కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటించి మంచి హీరోయిన్గా గుర్తింపు పొందింది. అయితే కొన్నాళ్లుగా సదాకు సరైన సక్సెస్ లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ ఫీడే అవుట్ హీరోయిన్గా మారిపోయింది.
ప్రస్తుతం పలు టీవీ షో లలో జడ్జిగా వ్యవహరిస్తూనే  అడపాదప సినిమాలలో నటిస్తూ ఉంది సదా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఒక వ్యక్తితో ప్రేమలో మునిగిందని ప్రచారం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది. ఆ ప్రేమ వ్యవహారాల వల్లే సదా కెరియర్ పూర్తిగా మారిపోయింది అని ప్రచారం నడుస్తోంది. ఈ కారణంగానే సదా ఇప్పటివరకు వివాహం చేసుకోలేదని వార్తలు కూడా గత కొద్దిరోజులుగా బాగా వినిపిస్తున్నాయి. మరొకవైపు సదా తన తోటి హీరోయిన్లు ఇప్పటికే వివాహం చేసుకొని పిల్లల్ని సైతం కంటు.. మరి సినిమాలలో రీఎంట్రీ ఇస్తూ సత్తా చాటుతున్నారు.

కానీ సదా మాత్రం 38 ఏళ్లు వచ్చిన ఇంకా పెళ్లి ఊసే ఎత్తలేదు. ఇటీవలే అడవులకు వెకేషన్ కు వెళ్తూ అక్కడ తీసిన కొన్ని వీడియోలను పోస్ట్ చేయడం జరుగుతోంది. తాజాగా ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అందులో ఒక ఎమోషనల్ మ్యాటర్ ని కూడా జత చేసి షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారుతోంది. అవసరాల కోసం ఉన్న బంధాలలో చిక్కుకుపోయి ఆ మనుషులు వెళ్లిపోతారేమోనని ఎందుకు భయపడుతున్నారు.. మనం సన్నిహితులు అనుకునేవాళ్లు మనమల్ని అనుకోకపోతే వాళ్లకి దూరంగా ఉండడమే మంచిది అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేయగా.. అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే సదా ఈ పోస్టుని ఎవరికోసం షేర్ చేసిందో అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: