కామెడీ షో జబర్దస్త్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ఇక ఇందులో యాంకర్లుగా అడుగుపెట్టిన అనసూయ, రష్మీ లకు ఈ షో తోనే మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచే వెండితెరపై అడుగుపెట్టి మంచి సక్సెస్ లు అందుకున్నారు.తాజాగా కొత్త యాంకర్ రావటంతో.. యాంకర్ రష్మీ కూడా వెళ్ళిపోతుందేమో అని అనుమానాలు వస్తున్నాయి. ఇక కొంతమంది మాత్రం రష్మీ కూడా జబర్దస్త్ మానేసింది అని అంటున్నారు.
కానీ తాజాగా ఆమె ఆ షో గురించి అందులో తన యాంకర్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.ఇక జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది రష్మీ గౌతమ్. ఇక అలా యాంకరింగ్ తో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. గ్లామర్ విషయంలో కూడా యువతను బాగా ఆకట్టుకుంటుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అయితే తనకంటూ క్రేజ్ మాత్రం బుల్లితెర పైనే సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలు, వీడియోల షేర్ లతో బాగా బిజీగా ఉంటుంది.
అంతేకాదు వ్యక్తిగతంగా కూడా రష్మీ కి మంచి పేరు ఉంది. సమాజంలో జరిగే వాటి గురించి బాగా స్పందిస్తుంది. అయితే నిజానికి.. రష్మీ కి బుల్లితెరలో ఇంత క్రేజ్ రావడానికి కారణం.. మరో కమెడియన్ సుడిగాలి సుధీర్ అనే చెప్పాలి ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య వెండితెరపై అవకాశాలు అందుకుంటుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు జబర్దస్త్ లో కొత్త యాంకర్ రావటంతో.. పైగా రష్మీకి అవకాశాలు వస్తుండటంతోఇక జబర్దస్త్ కి దూరంగా ఉంటుందేమో అని అనుమానాలు వచ్చాయి. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని జబర్దస్త్ లో తన పొజిషన్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఇక తను ఎంత బిజీగా ఉన్న కూడా జబర్దస్త్ కు ఇంపార్టెంట్ ఇస్తాను అన్నట్లు.. ఒకవేళ సినిమాలలో అవకాశాలు వస్తే కూడా డేట్స్ బట్టి షో కు యాంకర్ గా చేస్తాను అంటూ తెలిపింది. అంటే ఇక రష్మీ జబర్దస్త్ కు ఇక గుడ్ బై చెప్పదు అని.. ఒకవేళ తనకు అవకాశాలు వచ్చినా కూడా మల్లెమాలకు సమయానికి కేటాయిస్తాను అన్నట్లుగా తెలిపింది..!!