టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రామ్ పోతినేని అనేక విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ పోతినేని తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు భాషలలో రూపొందింది. ఈ మూవీ లో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా , ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు కెరియర్ లో మొట్ట మొదటి సారి రామ్ పోతినేని ఈ మూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం , ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందడంతో , ఈ మూవీ పై సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ది వారియర్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు లేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ది వారియర్ మూవీ తాజాగా బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ మూవీ శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. స్టార్ మా సంస్థ తాజాగా ఈ మూవీ ని ప్రసారం చేయగా ఈ మూవీ కి మొట్ట మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 10.02 "టి ఆర్ పి" రేటింగ్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ మూవీ కి ఈ రేంజ్ టి ఆర్ పి అంటే మామూలు విషయం కాదనే చెప్పవచ్చు.