బిడ్డ పుట్టిన సందర్భంగా అలియా ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Divya
అటు బాలీవుడ్ హీరో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ ఆలియా భట్ సుపరిచితమే..RRR, బ్రహ్మాస్త్రం మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయింది ఆలియా భట్. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ను  వివాహం చేసుకుంది. తాజాగా నిన్నటి రోజున ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఆలియా భట్. అయితే ఈ విషయంపై తాజాగా ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ కాస్త వైరల్ గా  మారుతోంది వాటి గురించి చూద్దాం.
గడిచిన కొన్ని నెలల క్రితం రణబీర్ కపూర్, ఆలియా భట్ వివాహం అవ్వగా.. అలా  వివాహమైన రెండు నెలలకే ఆలియా భట్  గర్భవతి అని విషయాన్ని తెలియజేశారు. అలా అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి.. బిడ్డ పుట్టిన వెంటనే ఆలియా భట్ తన సోషల్ మీడియా వేదికకు ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది. ఇక వీరిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్రం సినిమా కూడా ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటోంది. ఆలియా భట్ ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ రాయడంతో అభిమానులు ఆమెకు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.
ఆలియా భట్ ఇలా రాసుకుంటూ.. మా జీవితాలలో ఒక బెస్ట్ న్యూస్ అని మ్యాజికల్ పాప వచ్చేసింది అంటూ ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేయడం జరిగింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తల్లిదండ్రులుగా మారడం చాలా ఉద్వేగ భరితంగా ఉందని తెలియజేస్తూ ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆలియా భట్ షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమాలలో నటిస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఆలియా మాత్రం సినిమాలలో నటించాలని ఆమె అభిమానులు చాలా ఘాఢంగా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: