కమలహాసన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలో రూపొందుతున్నాయి. ఇటీవలే విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ఈ హీరో ఇప్పుడు మరొక యాక్షన్ భరితమైన సినిమా ఇండియన్ 2 చేయబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన రెండు మూడు యాక్షన్ సినిమాలను చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అందులో విక్రమ్ 2 సినిమా కూడా ఉంది. ఈ విధంగా 60 ఏళ్ల వయసులో కూడా యాక్షన్ సినిమాలలో నటిస్తూ ఉన్న కమలహాసన్ ను చూసి చాలా మంది యువ హీరోలు ఆశ్చర్యపడిపోతున్నారట.
విక్రమ్ 2 సినిమా సంచలన విజయాన్ని అందుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు అయినా కూడా కమలహాసన్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెస్మరైజ్ చేశాడు. అందుకే ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా కనెక్ట్ అయ్యింది. అలా 60 ఏళ్ల వయసులో ఆ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలలో అద్భుతంగా నటించిన కమలహాసన్ ఆ తరువాత కూడా మళ్లీ యాక్షన్ సినిమాలోనే చేయడం విశేషం. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలోనే ఖైదీ 2 సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతూ ఉండగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేయడం విశేషం
వాస్తవానికి ఈ సినిమాను ఎప్పుడో పూర్తి చేయవలసిన కమలహాసన్ పలు కారణాలవల్ల దీన్ని చేయలేకపోయాడు. దర్శకుడికి నిర్మాతకు మధ్య పొత్తు కుదరకపోవడంతో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశాడు. అయితే ఇంతటి మంచి సినిమాను మధ్యలో ఆపివేయడం కరెక్ట్ కాదని భావించి ఈ ఇద్దరికి మధ్య సయోధ్య కుదిరేలా కమలహాసన్ చేశాడు. దాంతో ఫైనల్ గా ఈ ఇద్దరు సినిమా చేయడానికి ఒప్పుకోగా కమలహాసన్ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను జోరుగా చేస్తున్నాడట మరి కమలహాసన్ లాంటి హీరో ఇలాంటి సినిమాలలో వరసగా నటించడం యువ కథానాయకులకు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది అని చెప్పాలి. పాత్ర గురించి ఎంతటి దూరమైనా వెళ్లి రిస్క్ చేసే కమలహాసన్ రాబోయే సినిమాలతో ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి