పుష్ప 2 కు అవతార్ 2 అండ !
‘పుష్ప’ మూవీతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో సెలెబ్రెటీగా మారిపోయాడు. బన్నీ మేనరిజమ్స్ డైలాగ్స్ వరల్డ్ లెవెల్లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. మెడ కింద చెయ్యి పెట్టి ‘తగ్గేదే లే’ అంటూ చెప్పిన డైలాగ్ ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా అన్ని దేశాలలోని సినిమా ప్రేక్షకులను ఆకర్షించింది.
ఇప్పుడు త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ‘పుష్ప 2’ ఫై కూడ అంచనాలు విపరీతంగా ఉన్నాయి. దీనితో ఈసినిమా పై ఏర్పడ్డ మ్యానియాతో ఈమూవీకి అత్యంత భారీస్థాయిలో బిజినెస్ అవుతుందని అంచనాలు కడుతున్నారు. ‘పుష్ప 2’ బిజినెస్ మరింత పెంచడం కోసం సుకుమార్ చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. తెలుస్తున్న సమాచారంమేరకు ఒక బ్యాంగ్ బ్యాంగ్ వీడియో ప్రోమోతో ‘పుష్ప 2’ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట సుకుమార్. నేరుగా ‘పుష్ప 2’ టాకీ పార్ట్ చిత్రీకరణ మొదలుపెట్టకుండా టీజర్ గ్లింప్స్ కోసం విజువల్స్ సుకుమార్ తీయబోతున్నాడట. దీనికి సంబంధించిన షూటింగ్ ను రామోజీ ఫిలిం సిటీలో పూర్తిచేసి ఆతరువాత ఈసినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూట్ ను మొదలుపెట్టాలని సుకుమార్ ఆలోచన అని అంటున్నారు.
అంతేకాదు షూట్ చేసిన ‘పుష్ప-2’ టీజర్ గ్లింప్స్‌ను ‘అవతార్-2’ రిలీజ్ రోజు వరల్డ్ వైడ్ గా ఆసినిమా ప్రదర్శింపబడే అన్ని థియేటర్లలోను దాదాపు 25 భాషల్లో ఈటీజర్ గ్లింప్స్ లాంచ్ చేయాలని సుకుమార్ ఆలోచన అని అంటున్నారు. దీనితో ‘అవతార్ 2’ మ్యానియాతో పాటు ‘పుష్ప 2’ మ్యానియా కూడ ఏర్పడి ఈమూవీకి ఎవరు ఊహించని స్థాయిలో బిజినెస్ జరపాలని సుకుమార్ ఆలోచన అని తెలుస్తోంది..