ఆదిత్య 369 సినిమా మళ్ళీ రానుందా?

Satvika
ఆదిత్య 369 సినిమా గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు..రాజుల కాలంలో ఎలా ఉండేవారు..ఆధునిక యుగంలో మనుషులు ఎలా ఉంటారో అని ఆ సినిమాలో చక్కగా చూపించారు.ఆ సినిమా లో సైన్స్ గురించి కూడా చెప్పారు.అన్నీ విధాలుగా ఆ సినిమా జనాలను ఆకట్టుకుంది. బాక్సాఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా మళ్ళీ వస్తే బాగుండు అని అందరు అనుకున్నారు..ఈ విషయం పై బాలయ్య కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యాలు చేశారు.

బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి..వీటికి భారీగా స్పందన వచ్చింది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చి హంగామా చేశారు. మూడో ఎపిసోడ్ లో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ గా సాగింది. ఈ ఎపిసోడ్ లో సినిమాల గురించి పలు విషయాలు మాట్లాడారు. శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా గురించి బాలకృష్ణ ప్రస్తావించారు.

ఈ సినిమా తనకి హార్ట్ టచింగ్ లా అనిపించిందని, ఈ సినిమా టైం మిషన్ కాన్సెప్ట్ చూసి నాకు నా ఆదిత్య 369 సినిమా గుర్తొచ్చింది అని అన్నారు బాలయ్య..అంతేకాదు ఆ సినిమా రిమెక్ కథను కూడా తానే రాసినట్లు చెప్పారు.కథ రాయడం కూడా అయిపోయింది. నేను కూడా కొద్దో గొప్పో కథలు రాస్తాను. త్వరలోనే టైం మిషన్ కాన్సెప్ట్ తో ఆదిత్య 999 మ్యాక్స్ మొదలుపెడతాను అని తెలిపారు బాలయ్య. దీంతో యువ హీరోలిద్దరూ వెయిటింగ్ సర్ ఆ సినిమా కోసం అని అన్నారు. బాలయ్య వ్యాఖ్యలతో ఉంటుందో, ఉండదో క్లారిటీ లేని ఆదిత్య 999 సినిమా లేట్ అయినా కచ్చితంగా ఉంటుందని అర్ధమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: