హీరో శర్వానంద్, సందీప్ కిషన్, అడవి శేష్ వంటి పెళ్లి కానీ యువ హీరోలు చాలామందే ఉన్నా.. ఎవరిపై లేని డేటింగ్ రూమర్స్ మాత్రం అల్లు శిరీష్ పైనే ఉంటాయి.అయితే శిరీష్ మొదటి సినిమా గౌరవం హీరోయిన్ యామీ గౌతమ్ నుండి మొదలుకొని తాజాగా అను ఇమ్మానుయేల్ వరకు అల్లు శిరీష్ పై గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా నుండి అల్లు అరవింద్ దెగ్గరికి సైతం వెళ్తే ఆయన తనని డైరెక్ట్ గా అడిగేశాడని హీరోయిన్ అను ఇమ్మానుయేల్ షాకింగ్ కామెంట్స్ చేసింది.కాగా జోక్ చేశాడో సీరియస్ గానే అడిగాడోకాని..
తన కొడుకుతో డేటింగ్ లో ఉన్నావా అంటూ అల్లు అరవింద్ తనని అడిగిన విషయాన్నీ తాజాగా ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన 'ఊర్వశివో రాక్షసివో' మూవీ ప్రమోషన్స్ లో చెప్పింది అను ఇమ్మానుయేల్.ఇకపోతే అల్లు శిరీష్ తో డేటింగ్ గాసిప్స్ పై హీరోయిన్ అను స్పందిస్తూ.. 'ఊర్వశివో రాక్షసివో సినిమా షూటింగ్ సమయంలో నేను, అల్లు శిరీష్ డేటింగ్లో ఉన్నామనే గాసిప్ వచ్చింది. ఇక అది అందరి నుండి మా అమ్మ చెవిన కుడ పడింది. దాంతో అమ్మ చాల బాధపడింది. అయితే ఇక నాకు ఈ సినిమా వరకు శిరీష్ తో పరిచయం లేదు.
కాగా ఊర్వశివో రాక్షసివో సినిమా షూటింగ్ కి ముందు చర్చల్లో ఒక్కసారి కలిసి మాట్లాడుకున్నాం అంతే.అయితే అంత మాత్రానికే మా ఇద్దరిపై రూమర్స్ రావటం చూసి మేము నవ్వుకునే వాళ్ళం. అయితే ఇక నేను అంతకుముందే అల్లు అరవింద్ గారికి తెలుసు.కాగా అల్లు అర్జున్ తో నా పేరు సూర్య మూవీ షూటింగ్ లో ఆయనతో తనకి చాల చనువు ఏర్పడింది.ఇక ఆ చనువుతోనే తన అనుమానాన్ని నివృత్తి చేసుకున్నారు. సెట్స్ లో ఒకసారి నా కొడుకుతో నువ్వు డేటింగ్ చేస్తున్నావా అని నన్ను ఆయన డైరెక్ట్ గా అడిగేశాడని చెప్పింది.ఆ తర్వాత ఆ గాసిప్ గురించి ఇద్దరం మాట్లాడుకుంటూ చాలా సేపు నవ్వుకున్నాం అని అను ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చింది..!!