టాలీవుడ్
డైరెక్టర్ అనుదీప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు...అనుదీప్.ఇదిలావుంటే ఇక జాతిరత్నాలు ఫేమ్
అనుదీప్ కేవీ గాడ్ ఫాదర్ పై ఓపెన్ కామెంట్ చేశాడు.అయితే ప్రతిఒక్కరూ
గాడ్ ఫాదర్ చూశావా? అని అడుగుతుంటే వాళ్ళ కోసం
సినిమా చూశాను. ఇక నాకు
సినిమా బోర్ కొట్టింది అన్నారు.అంతేకాదు చివరికి ఆ షో యాంకర్ కూడా అనుదీప్ స్టేట్మెంట్ కి భయపడ్డారు. ఇక ఇండస్ట్రీలో తన పరపతి ఎక్కడ పోతుందోనని అవునా ''ఫస్ట్ టైం వింటున్నాను'' అని కవర్ చేసుకుంది.అయితే అనుదీప్ మాత్రం తగ్గకుండా నేనే కాదు చాలా మందికి
గాడ్ ఫాదర్ నచ్చలేదని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు.
ఇక ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఇప్పటికే వందల కాల్స్ అనుదీప్ ఫేస్ చేసి ఉంటాడు.అయితే చిరంజీవి కంటే ఎక్కువ బాధపడే వర్గం అనుదీప్ ని బెదిరించి ఉంటారు. ఇకపోతే కొందరు సున్నితంగా చెప్పి ఉంటారు. ఇక నీ కెరీర్ ఢమాల్ అని భయపెట్టి ఉంటారు. అయితే ఇక భజన చేస్తేనే బ్రతుకు అనుకునే చాలా మందికి అనుదీప్ స్టేట్మెంట్ చెంపపెట్టు. అంతేకాదు నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే చిరంజీవికి కూడా నిజాలు తెలుస్తాయి. అయితే ఆయనకు మేలు చేసినవారు అవుతారు. ఇక అనుదీప్ లాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తారు.ఇక
చిరంజీవి గొప్పవారు. స్వయంకృషితో ఎదిగిన నటుడు. ఇక ఇది అందరికీ తెలుసు.అయితే మీరు మైకులో చెప్పనంత మాత్రాన జనాలు మర్చిపోరు.
ఆయన
చరిత్ర మరుగున పడిపోడు. ఇక అవసరం ఉన్నా లేకుండా దానిపై ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు?. ఆయన విజయాలను గుర్తు చేసుకోవడంలో తప్పులేదు...అదే సమయంలో అపజయాలను ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి.ఇకపోతే
గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అని కలెక్షన్ లెక్కలు చెబుతుంటే
నిర్మాత మాత్రం
బ్లాక్ బస్టర్ అంటూ ప్రకటించి స్వామిభక్తి చాటుకున్నారు.అయితే సొంతగా రిలీజ్ చేశాం మూవీకి ఎంతొచ్చినా హిట్టయినట్లే అని వితండవాదం చేశారు.ఇక గాడ్
ఫాదర్ చిరంజీవి డైహార్ట్ ఫ్యాన్స్ కి నచ్చిందేమో కానీ సగటు ప్రేక్షకుడికి నచ్చలేదు. అయితే దాని ఫలితంగా రూ. 30 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి.కాగా నిర్మాత సంగతి పక్కన పెడితే
గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ కాదని పరిశ్రమకు చెందినవారు ఎవరూ చెప్పరు.ఇక అది వాళ్లకు సంబంధం లేని వ్యవహారం.అయితే ఒకవేళ స్పందించాల్సి వస్తే
చిరంజీవి మూవీ రికార్డులు బద్దలు కొట్టింది అంటారు కానీ,
సినిమా బాగాలేదన్న మనసులో మాట బయటపెట్టరు..!!