గీత ఆర్ట్స్ పై విడుదల కాబోతున్న మరొక బ్లాక్ బస్టర్ సినిమా..!!

Divya
సినిమాలతో బిజినెస్ చేయడంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. మరొకవైపు గీత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా కూడా పలు భాషా చిత్రాలను తెలుగులో విడుదల చేస్తూ బాగానే సక్సెస్ అందుకుంటూ ఉంటున్నారు. అంతేకాకుండా ఆహా ఓటీటి వేదికలో కూడా పలు చిత్రాలను విడుదల చేస్తూ రేటింగును బాగా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల కన్నడలో విడుదలైన కాంతారా చిత్రం తెలుగులో విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నారు ఇప్పుడు తాజాగా మరొక హర్రర్ కామెడీ సినిమా అని కూడా తెలుగు ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నారు అల్లు అరవింద్. ఆ సినిమా పేరు భేదియా.

ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు అనే సినిమా టైటిల్ తో విడుదల చేయబోతున్నారు హీరో వరుణ్ ధావన్ హీరోయిన్గా కృతి సనన్ జంటగా నటించారు. ఈ సినిమాకి నిర్మాతగా దినేష్ విజన్ బాలీవుడ్కు పరిచయమయ్యారు. 2018 లో వచ్చిన ఈ హర్రర్ కామెడీ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే గత సంవత్సరం వచ్చిన రుహి అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. ఆ తర్వాత దినేష్ విజన్ హర్రర్ కామెడీ యూనివర్సిటీలో వస్తున్న భేదియా ఈ సినిమా అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిందీతో పాటు తమిళ్ ,తెలుగు భాషలలో నవంబర్ 25న థియేటర్లో విడుదల చేయబోతున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగ మంచి స్పందన లభిస్తోంది. తెలుగులో తోడేలు అనే టైటిల్ని ఖరారు చేసినట్లుగా . ఇక అల్లు కాంపౌండ్లు నిర్మాత బన్నీ వాసు ఆలోచనలు అల్లు అరవింద్ నిజం చేస్తూ ఇటీవల గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగు రాష్ట్రాలలో కాంతారా చిత్రాన్ని విడుదల చేయగా ఊహించని విధంగా లాభాలు అందుకుంది. మరి తోడేలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరొకసారి మెస్మరైజ్ చేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: