ఈసారి సంక్రాంతి పండగకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బాక్స్ ఆఫీస్ వార్ కనిపించే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ ని సంక్రాంతి కనుక విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి మూవీ ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.
ఈ రెండు మూవీ లతో పాటు టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇలా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోలు నటించిన ఈ మూడు మూవీ లను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందాలు ప్రకటించినప్పటికీ , ఈ మూడు మూవీ లను ఏ తేదీ లలో విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఏ మూవీ యూనిట్ ప్రకటించ లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ ఈ అన్ని సినిమాల కంటే ముందు 11 జనవరి 2023 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ ని 12 జనవరి 2023 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ మూవీ ని 13 జనవరి 2023 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూడు మూవీ లపై కూడా తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.