
సమంత పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినా చిరంజీవి..!!
తాను సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో పెట్టి తనకు ప్రాణాంతక వ్యాధి అనిచెప్పి అందరికి షాక్ ఇచ్చింది. దీంతో అప్పటి వరకు సమంత అప్డేట్ పోస్టు కోసం చూసిన వారు.. ఇలాంటి పిక్ ను చూసి ఆందోళన చెందారు. ఆమె చెప్పిన విషయంతో అభిమానులే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు 'గెట్ విల్ సూన్' పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలా స్పందించారు మరీ, ఆమెకు వచ్చిన వ్యాధిపై మోటివేట్ చేస్తూ ట్విట్టర్లో ఓ మెసేజ్ కూడా పెట్టాడు చిరు, ఆ మెసేజ్ వైరల్ కావడంతో అందరూ ప్రశంసిస్తున్నారు.
'ఏమాయ చేశావె' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సమంత మొదట్లో నార్మల్ గానే కనిపించారు. కానీ ఈ తరువాత తన నట భీభత్సాన్ని చూపించడంతో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళం మళయాల, హిందీ సినిమాల్లోనూ సమంతకు బోలెడు అవకాశాలు వచ్చాయి. అటు వెబ్ సిరీసుల్లోనూ సమంత క్రేజీ ప్రాజెక్టులను తన సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఆమెకు వ్యాధి ఉందన్న విషయం అందరినీ కలవరానికి గురి చేసింది మరీ
సినిమాలో ఎంత బిజీ ఉన్నా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది సమంత. అయితే ఎప్పుడూ అభిమానులను అలరించే పోస్టులు పెట్టే ఈ బ్యూటీ ఒక్కసారిగా తనకు 'వయోసిటీస్' ఉన్నట్లు చెప్పడం అందరినీ షాక్ కు గురి చేసింది. కొద్ది రోజులుగా ఈ వ్యాధితో బాధపడుతున్నానని.. అయితే ప్రస్తుతం కోలుకుంటున్నానని సమంత తెలిపింది. సమంత ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నా.. సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఆమెకు వృత్తిపై ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనం అని కొందరు కొనియాడుతున్నారు మరీ
సమంతకు 'వయోసిటీస్' అని తెలియడంతో సినీ ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సమంత కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, లావణ్య త్రిపాఠి, హన్సికతో పాటు అక్కినేని అఖిల్ కూడా స్పందించారు అని. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. అయితే చిరు అందరిలాగా నార్మల్ పోస్టులు పెట్టలేదు. సమంతను మోటివేట్ చేస్తూ మెసేజ్ పెట్టడం అందరినీ ఆకట్టుకుంది. అందులో ఏముందంటే..?
'మారుతున్న జీవితంలో అనేక చాలెంజ్ లు మనకు వస్తంటాయి. వాటిని స్వాగతించి మనలోని ఎంతో శక్తిని కనిపెట్టి వాటిని అధిగమించాలి. నీలో గొప్ప శక్తి ఉంది. నువ్వు దృఢమైన అమ్మాయివి.. అతి త్వరలో నీకొచ్చిన వ్యాధిని అధిగమిస్తావని అనుకుంటున్నాను. అటుపోట్లన్నీ అధిగమించడం నీకు పెద్ద విషయం కాదు.. అయినా త్వరగా ఈ వ్యాధి నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నా..' అని మెగాస్టార్ చేసిన మెసేజ్ పై అందరీ ప్రశంసలు కురుస్తున్నాయి మరీ.