రజనీకాంత్ కు డబ్బు సహాయం చేసింది ఎవరో తెలుసా..?
రజనీకాంత్ మాట్లాడుతూ SSLC చదివే సమయం లో కుటుంబ సభ్యులు పరీక్ష కోసం రూ.150 రూపాయలు ఇచ్చారని అయితే ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతానని తనకు ముందే తెలుసని రజనీకాంత్ తెలియజేశారు. అయితే మద్రాస్ రైలు ఎక్కానని.. కానీ రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఎక్కడో టికెట్ పడిపోయిందని రజనీకాంత్ తెలిపారు. టికెట్ ఇన్స్పెక్టర్ చెకింగ్ కోసం రాగ టికెట్ పోయిందని చెప్పగా ఫైన్ కట్టమని చెప్పారట. ఆ సమయంలో తన దగ్గర డబ్బులు లేకపోవడంతో టిసి గట్టిగా అరవడంతో ఐదు మంది రైల్వే కూలీలు తన జరిమానా కట్టినట్లు తెలియజేశారు.
అప్పుడు నేను టికెట్ తీసుకోలేదని అనుకుంటారేమో అని నేను టికెట్ తీసుకోవడం వాస్తవమని ఈ విషయాన్ని టిసి కు చెబుతున్న నమ్మడం లేదని రజనీకాంత్ తెలియజేశారు. అయితే చివరికి టిసి నమ్మడంతో రజనీకాంత్ తన జీవితంలో తెలియని వ్యక్తి తనను నమ్మడం ఇదే మొదటిసారి అని తెలియజేశారు. ఇక అటు తర్వాత తనను నమ్మిన వ్యక్తి బాలచందర్ అని రజనీకాంత్ తెలియజేశారు. ఆ తర్వాత ప్రజలు తనని ఎక్కువగా నమ్ముతున్నారని ప్రజలు నమ్మకాన్ని తను ఎప్పుడు ఒమ్ము కానివ్వనని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రజనీకాంత్ తెలియజేసిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.