నాలుగు సార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన నిత్యా మీనన్.. అన్నీ సార్లు పాజిటివ్ వచ్చిందంటూ..?

Anilkumar
తాజాగా సోషల్  మీడియా వేదికగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేస్తూ అద్భుతం మొదలైదంటూ హీరోయన్ నిత్యామీనన్ చేసిన పోస్ట్ ఎంత గందరగోళం సృష్టించిందో తెలిసిన విషయమే. అయితే ఆకస్మాత్తుగా తన ఇన్ స్టాలో ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.ఇక  పెళ్లి ఎప్పుడూ జరిగింది ? నిజంగానే తల్లికాబోతుందా ? అంటూ అనేక రకాల కామెంట్స్ చేశారు.  మరికొందరు తన తదుపరి ప్రమోషన్ కోసం నిత్యా ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

 ఇక రెండు రోజుల క్రితం ప్రెగ్నెన్సీ కిట్‏తో షాకిచ్చిన నిత్యా.. తాజాగా వీడియో షేర్ చేస్తూ కన్య్ఫూజ్ చేసింది. ఆమె తన తదుపరి సినిమా లో నోరా అనే పాత్రలో నటిస్తున్నట్లుగా హింట్ ఇచ్చేసింది.  ఇక ఆ వీడియోలో ఒక్కసారి కాదు నాలుగు సార్లు టెస్ట్ చేయించుకున్నాను.. అయినా పాజిటివ్ వచ్చింది. అయితే  ఇదెలా సాధ్యమైందంటూ నిత్యా మాట్లాడింది. అనుకోనేవి ఇలా జరుగుతుంటాయి అంటూ ది వండర్ ఉమెన్ అనే క్యాప్షన్ ఇచ్చింది.ఇక  దీంతో నిత్యా ది వండర్ ఉమెన్ అనే సిరీస్ చేయనుందని క్లారిటీ వచ్చేసింది.కాగా ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

అయితే మొత్తానికి తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఒక్క వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టేసింది ఈముద్దుగుమ్మ. మరోవైపు.. హీరోయిన్ పార్వతి తిరువోతు సైతం తన ఇన్ స్టా వేదికగా ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది. ఇక అందులో తన ఫోన్ పట్టుకుని.. 'హే సిరి.. ప్రెగ్నెన్సీ కిట్స్ ఎంతవరకు నమ్మవచ్చు' అంటూ అడుగుతుంది.అయితే  దానికి ఫోన్ లో 'ఇది ఏదైతే నమ్ముతున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది' అంటూ రిప్లై వచ్చింది. ఆ తర్వాత ఆమె 'ఏయ్ సిరి.. నాకు నేనుగా ఓ బిడ్డను పెంచడం కష్టమా?' అని అడగ్గా.. వెంటనే ఫన్నీ ఆన్సర్ వచ్చింది.కాగా 'ఒక పిల్లవాడు 4 సంవత్సరాల వయస్సులోపు నడవగలడు. అయితే కొందరికి ముందుగానే ట్రైనింగ్ ఇవ్వవచ్చు.'... అంటూ రిప్లై రాగానే.. విసుగ్గా షట్ అప్ సిరి అని రిప్లై ఇచ్చింది.ఇక  ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: