విజయ్ సినిమాకు మహర్షి నేపధ్యం !
‘వారసుడు’ టైటిల్ తో రాబోతున్న సంక్రాంతి రేస్ కు విడుదలకాబోతున్న ఈమూవీ తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈసినిమాకు సంబంధించి వంశీ పైడిపల్లి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఈమూవీ నిర్మాత దిల్ రాజ్ కు కొంతమేరకు అసహనం కలిగించాయి అన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
వంశీ పైడిపల్లి ఈసినిమా గురించి మాట్లాడుతూ ఇది రెండు భాషలలో విడుదల అవుతున్నప్పటికీ ఇది కేవలం తమిళ సినిమాగా మాత్రమే తీసామని కామెంట్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు దిల్ రాజ్ దృష్టి వరకు వెళ్ళడంతో అతడు కొంతమేరకు అసహనానికి లోనైనట్లు గాసిప్పులు వస్తున్నాయి. దీనికి కారణం ఈసినిమాను రెండు భాషలలోను ఒకేసారి విడుదల చేయాలి అని దిల్ రాజ్ భావిస్తున్న పరిస్థితులలో ఈసినిమా తమిళ సినిమా డబ్బింగ్ అన్న ఫీలింగ్ తెలుగు ప్రేక్షకులకు ఏర్పడితే ఈమూవీ కలక్షన్స్ పై దీని ప్రభావం ఉంటుంది కదా అన్న భయం దిల్ రాజ్ కు ఉన్నట్లు టాక్.
ఈ విషయమై దిల్ రాజ్ కు వంశీ పైడిపల్లి కి మధ్య కొన్ని చర్చలు కూడ జరిగాయని అంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య సోదర భావం ఉండటంతో ఈవిషయం బయటకు రాలేదు అన్న ప్రచారం కూడ ఉంది. వాస్తవానికి తమిళ హీరో విజయ్ కి ఎప్పటి నుండో తెలుగు మార్కెట్ పై కన్ను ఉంది. ఒక భారీ సినిమాను తెలుగులో కూడ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి అన్న ప్రయత్నంలో ‘వారసుడు’ సినిమాను తెలుగులో కూడ భారీగా ప్రమోట్ చేయాలని టాక్..