ఆ సినిమా నుంచి తప్పుకుంటున్న కియారా అద్వానీ..!!

Divya
భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది హీరోయిన్ కియారా అద్వానీ. ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ నటించిన భూల్ భాలైయ్యా 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది మరొక సినిమా జగ్ జగ్ జియో సినిమా పర్వాలేదు అనిపించుతుంది ఇక ఈ ముద్దుగుమ్మ లైన్లో పెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ఇదే వేగంతో ఇటీవల అశోతోష్ గోవరికర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి కుర్రమ్ కుర్రమ్ అనే టైటిల్ని కూడా చిత్రీకరించారు.

అయితే ఇందులో సదరు డైరెక్టర్ కి కియారా ఊహించని సాధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముద్దుగుమ్మ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా కమర్షియల్ గా ఈ సినిమా వర్కౌట్ కాదని భావించి ఈ సినిమాలో తన పాత్రకి పెద్దగా ప్రమేయం లేవని తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా యూనిట్ త్వరలోనే అందుకు సంబంధించి విషయాన్ని తెలియజేస్తుందని బాలీవుడ్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరీ ఇతర కారణాల చేత ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా నుంచి తప్పకుండా అనే సందేహాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.

బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న RC -15 నటిస్తున్నది. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం ఎలాంటి సమయంలోనైనా అందుబాటులో ఉంటానని తాను డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ సినిమాని భావిస్తున్నట్లుగా కియరా అద్వానీ తమ సన్నిహితులతో చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కేవలం రామ్ చరణ్, కీయారా మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది ఇక బాలీవుడ్ లో కొన్ని కమిట్మెంట్ పూర్తి చేయవలసిన నేపథ్యంలో డేట్లు సర్దుబాటు కాలేకపోవడం వల్లే ఆ సినిమాను ఎగ్జిట్ చేసినట్లుగా వార్త వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: