పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే అది పురుష్ ను కంప్లీట్ చేసి రిలీజ్ కు సిద్దంగా ఉంచిన ప్రభాస్..తన తరువాతి మూవీస్ అయిన " సలార్ ", ప్రాజెక్ట్ కే " సినిమాలను కూడా సెట్స్ పై ఉంచాడు. ఈ మూవీస్ తరువాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో " స్పిరిట్ " మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక ఇప్పటికే క్షణం తీరిక లేకుండా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటించేందుకు మరో ప్రాజెక్ట్ కు ఒకే చెప్పారు.
ఇకపోతే ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.అంతేకాదు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.ఇక ఈ మూవీలో ప్రభాస్ తో మారుతి ఫుల్ లేన్త్ కామిడీ పండించనున్నాడట. అయితే ఇక ప్రభాస్ గతంలో బుజ్జిగాడు మూవీకి కామిడీ ఏ రేంజ్ లో పండించారో అందరికీ తెలిసిందే.ఇక దీంతో మరోసారి ప్రభాస్ లోని కామిడీ యాంగిల్ ను బయటకు తీసేందుకు మారుతి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సిద్దం చేశారట. ఇకపోతే ఈ మూవీలో ప్రభాస్ చెవిటివాడి క్యారెక్టర్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు మారుతి సినిమాలలో హీరోలకు డిఫెక్ట్ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే గతంలో నానికి మతిమరుపు క్యారెక్టర్ పెట్టి " భలే భలే మగాడివోయ్ " మూవీతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు అలాగే శర్వానంద్ తో తీసిన " మహానుభావుడు " మూవీలో కూడా హీరో డిఫెక్ట్ క్యారెక్టరే. ఇక ఆ విధంగా ఈ సారి ప్రభాస్ తో తీసే మూవీలో ప్రభాస్ ను చెవిటివాడి క్యారెక్టర్ చూపించేందుకు సిద్దమయ్యారట మారుతి. ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికి.. మారుతి ప్రభాస్ కాంబినేషన్ మాత్రం దాదాపుగా ఖాయమే అని తెలుస్తోంది..!!