తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్న విశ్వక్ సేన్ ఆ తరువాత ఫలక్నామా దాస్ , హిట్ , పగల్ , అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ "ఓడి దేవుడా" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిథాలీ పాల్కర్ హీరోయిన్ గా నటించగా , అశ్విత్ మరిముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ అక్టోబర్ 21 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.
నైజాం : 1.73 కోట్లు .
సీడెడ్ : 46 లక్షలు .
ఆంధ్ర : 1.84 కోట్లు .
7 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓరి దేవుడా మూవీ 4.03 కోట్ల షేర్ , 6.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 11 లక్షలు .
ఓవర్ సీస్ లో : 61 లక్షలు . 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఓరి దేవుడా మూవీ 4.75 కోట్ల షేర్ , 8.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.