వామ్మో.. షణ్ముఖ్ జస్వంత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ఇలా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో షణ్ముఖ్ జష్వంత్ కూడా ఒకరు అని చెప్పాలి. యూట్యూబ్లో వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా భారీగానే ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇక యూట్యూబ్ ద్వారా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. బిగ్బాస్ షోలోకి వెళ్ళిన తర్వాత షణ్ముఖ్ పాపులారిటీ మరింత పెరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక ఇప్పుడు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తద్వారా బిజీబిజీగా గడుపుతూ ఉన్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఈ క్రమంలోనే ప్రస్తుతం షణ్ముఖ్ జస్వంత్ ఆదాయం ఎంత ఉంటుంది అన్నది మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే యూట్యూబ్లో పాపులారిటీ సాధించడానికి ముందు షణ్ముఖ్ జశ్వంత్ భారీగానే ఆస్తులను కలిగి ఉన్నాడట. ఇక యూట్యూబ్లో సంపాదన రావడం మొదలైన తర్వాత అతని ఆస్తులు విలువ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. దాదాపు షణ్ముఖ్ జశ్వంత్ కి 12 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అతని తండ్రికి సొంతంగా ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయట. నెలకు అటు వెబ్ సిరీస్ ల ద్వారా 30 లక్షల వరకు సంపాదిస్తున్నాడట షణ్ముఖ్ జశ్వంత్.