బాలకృష్ణ అల్లు అరవింద్ ల స్నేహం దేనికి సంకేతం !

Seetha Sailaja

చిరంజీవికి బాలకృష్ణ కు మధ్య బయటకు కనపడని ఒక గ్యాప్ ఉంది అన్నప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనికితోడు నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య ఓపెన్ గానే యుద్దాలు తమ హీరోల సినిమాల విడుదల సమయంలో జరుగుతూ ఉంటాయి. అల్లు అరవింద్ మెగా కాంపౌండ్ కు ముఖ్యంగా చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. ఒకవిధంగా చిరంజీవి మెగా స్టార్ గా మారడానికి సహాయ సహకారాలు చాల ఉన్నాయి.


అయితే  అల్లు అరవింద్ కు చిరంజీవి మధ్య బయటకు కనపడని చిన్న గ్యాప్ ఉంది అంటూ ఇండస్ట్రీలో ఒక ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈమధ్య జరిగిన అల్లు స్టూడియోస్ ఓపెనింగ్ సందర్భంగా మళ్ళీ చిరంజీవి అల్లు కుటుంబాలు తమ ఐఖ్యతా రాగాన్ని ఓపెన్ గానే ప్రకటించుకుని తామంతా ఒకటే అన్న సంకేతాలు ఇచ్చారు.


ఇది జరిగి కొద్దిరోజులు కాకుండానే ఇప్పుడు మళ్ళీ చిరంజీవి అల్లు అరవింద్ ల మధ్య ఏమైంది అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. దీనికికారణం అల్లు అరవింద్ ఆద్వర్యంలో నడుస్తున్న ‘ఆహా’ లో బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ ‘ష్టాపబుల్’ షోకు పవన్ త్రివిక్రమ్ లు కలిసి వస్తున్నారు అంటూ మొదలైన ప్రచారం బాలకృష్ణ చిరంజీవిని ఈషోకు పిలవకుండా ముందుగా పవన్ ను ఈ షోకు ఎందుకు పిలుస్తున్నారు అంటూ కొందరు షాక్ అవుతున్నారు.


ఇది చాలదు అన్నట్లుగా సంక్రాంతికి విడుదల అవుతున్న చిరంజీవి ‘వాల్టేర్ వీరయ్య’ మూవీతో బాలకృష్ణ ‘వీరసంహారెడ్డి’ విడుదల అవుతూ మళ్ళీ మెగా నందమూరి అభిమానుల మధ్య చిచ్చుపెట్టబోతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా బాలకృష్ణ రాబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు విని మరింత షాక్ అవుతూ శిరీష్ చిరంజీవిని కాకుండా బాలయ్యను ఎందుకు అతిధిగా పిలుస్తున్నాడు అంటూ మరికొందరు ఊహాగానాలు మొదలుపెట్టారు..





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: