గే అయితే అలా చేస్తానంటున్న రకుల్..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో తెలుగులో ఏ ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. కానీ ఈ ముద్దుగుమ్మకు వచ్చిన అవకాశాలు ఏవి సక్సెస్ గా అందుకోలేకపోయాయి. కానీ రకుల్ వేగానికి మాత్రం అడ్డుకట్టు రాలేదని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ అభిరుచికి తగ్గట్టుగానే తన అందాల ప్రదర్శనను కూడా చేస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండును ఫాలో అవుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోండి బాలీవుడ్లో రకుల్.

ఇక వ్యక్తిగతంగా కొన్నాళ్లుగా ఈమె జాకీ భాగ్నానితో ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేసింది. త్వరలోనే వివాహానికి సిద్ధమయింది అన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇ నేపద్యంలో తాజాగా రకుల్ పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారుతోంది. 2011 మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్న ఒక వింతైన ప్రశ్న ఎదురైందట. ఒకవేళ మీ కొడుకు గే అని తెలిస్తే ఏం చేస్తావు అని హోస్ట్లు  ప్రశ్నించగా.. అందుకు రకుల్ షాకింగ్ ఆన్సర్ తెలియజేసినట్లు సమాచారం. ఆ విషయం తెలియగానే ముందు షాక్ అవుతాను.. వెంటనే అతని చెంప దెబ్బ కొడతాను..ఆ తర్వాత ఆలోచిస్తాను.. అతని నిర్ణయాన్ని గౌరవిస్తాను..అదే దారిలో వెళ్లాలనుకుంటే తనకు ఎలాంటి సమస్య లేదని చెబుతానని తెలియజేసింది.

ఒక వారి వ్యక్తిగత స్వేచ్ఛకి ఎవరు అడ్డు ఉండరు అంటూ తెలియజేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. అయితే రకుల్ సమాధానం విన్న చాలామంది ఆశ్చర్యపోతున్నారు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని చెంప దెబ్బ కొట్టడం ఏంటి అతని స్థితిని అర్థం చేసుకోవాలి గా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ అప్పుడు ఏ ఉద్దేశంతో అలా స్పందించింది అన్న విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉన్నద. ఇలాంటి వింత ప్రశ్నలు మనిషి మానసిక స్థితిని తెలుసుకునేందుకు వేస్తుంటారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: