RRR సినిమా పాటకి స్టెప్పులేస్తున్న కుర్ర హీరోయిన్స్..!!

Divya
RRR మూవీ విడుదలై ఇండియాలో ఎంత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్నప్పటికీ ఈ సినిమా ఫీవర్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు ప్రేక్షకులు ఎంతలా కనేక్ట్ అయిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటి లో కూడా ప్రసారమవుతూ ఉన్నది. తాజాగా జపాన్ భాషలో కూడా ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. ఇక అలా ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి తదితరులు జపాన్ లో టోక్యో వీధుల్లో సందడి చేయడం జరిగింది. ఇక అలాగే జపానీలతో కలిసి వీరంతా ఆర్ఆర్అర్ ప్రీమియర్ షో ని తిలకించడం జరిగింది.

ఈ క్రమంలో ఆర్ఆర్అర్ మూవీ జపాన్ లో భారీగానే కలెక్షన్లు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాలోని ఒక సిగ్నేచర్ స్టెప్పులను ఇద్దరు ముద్దుగుమ్మలు డాన్స్ వేయక అది కాస్త చాలా వైరల్ గా మారుతోంది. ఓరి దేవుడా మూవీ సక్సెస్ సంబరాలలో భాగంగా ఈ చిత్రంలో నటించిన హీరోయిన్స్ మిథలా పాల్కర్, ఆశా భట్ కలిసి నాటు నాటు అనే పాటకి స్టెప్పులు వేయడం జరిగింది.
ఇక దీపావళి కాంతుల్లో మిథలా పాల్కర్, ఆశా భట్ కలిసి ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లాగా స్వింగ్ స్టెప్పులు ఉత్సాహాన్ని క్రియేట్ చేసిందని చెప్పవచ్చు ఈ వీడియోను మిథలా పాల్కర్ తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోకు.. నాటునాటు విత్ మై పార్టనర్ ఇన్ అనే కామెంట్ తో పాటు లవ్ సింబల్ ని ఎమోజిని జోడించింది అక్టోబర్ 21న విడుదలైన ఓరి దేవుడా చిత్రం మొదటి రోజు మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబడుతున్నట్లు సమాచారం ఈ చిత్రంలో వెంకటేష్ అతిది పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: