ప్రభాస్.. మాళవిక కాంబినేషన్లో సినిమా రాబోతోందా..?
నిన్నటి రోజున హీరోయిన్ మాళవిక మోహన్ డార్లింగ్ ప్రభాస్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. ఆమె తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేయడంతో ఆ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారుతోంది. దీంతో నెటిజెన్స్ ఈమె పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు పుట్టినరోజు తెలియజేశారు సెలబ్రెటీలు అందులో దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ నీల్ ,జగపతిబాబు సుకుమారన్ మాళవిక తన ట్విట్టర్ వేదికగా బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగింది.
మాళవిక మోహన్ హ్యాపీ బర్తడే టు వన్ ఆఫ్ మై ఫేవరెట్.. మీరు మరింత ఎత్తుకు ఎదగాలి అంటు రాసు కోచ్చింది. మాళవిక చేసిన ఈ గిఫ్ట్ కాస్త నెట్టింటే చాలా వైరల్ గా మారుతుంది దీంతో వీరిద్దరి కాంబినేషన్లు చూసేందుకు ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఇక ప్రభాస్ కూడా మారుతి డైరెక్షన్లో ఒక ప్రాజెక్టును చేయవలసి ఉంది దీంతో వీరిద్దరూ కలిసి ఈ చిత్రంలో నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.