కంటెంట్ ఉంటే దీపావళి కార్తీదే!!

P.Nishanth Kumar
దీపావళి సందర్భంగా రెండు తెలుగు సినిమాలు రెండు తమిళ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ నాలుగు సినిమాలలోను తమిళ సినిమాల ఎక్కువగా క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగులోనూ మంచి మార్కెట్ కలిగిన ఇద్దరు హీరోలు నటిస్తున్న సినిమాలు ఏకకాలంలో రెండు భాషలో విడుదల అవుతూ ఉండడం జరుగుతుంది.  అందుకే ఈ రెండు తమిళ సినిమాలకే ఎక్కువగా క్రేజీ ఉందని చెప్పవచ్చు. అందులోనూ ఒకటి కామెడీ ప్రధానం గా రాబోతున్న సినిమా, ఇంకొకటి యాక్షన్ మిళితమైన సినిమా.

అలాగే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఓరి దేవుడా సినిమాను దీపావళికి విడుదల చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటించగా ఈ సినిమాపై కొంత కూడా బజ్ కూడా లేకపోవడం నిజంగా ఈ సినిమా హిట్ అవుతుందా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కూడా కలుగజేస్తుంది. ఇకపోతే మరొక తెలుగు సినిమా మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నా కూడా దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న సినిమానే. ఆ విధంగా ఈ రెండు తెలుగు సినిమాలలో మీడియం రేంజ్ హీరోలు మాత్రమే ఉండడం తెలుగు ప్రేక్షకులను కొంత నిరాశ పరుస్తుంది.

ఇకపోతే రెండు తమిళ సినిమాల హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. మంచి ఫాలోయింగ్ కూడా ఉంది ఆ విధంగా ఈ రెండు సినిమాలకు హిట్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు. కార్తీ హీరోగా నటించిన సర్దార్ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటు శివ కార్తికేయన్ సినిమాకి కూడా మంచి బజ్ ఏర్పడింది. ఆ విధంగా ఇద్దరు హీరోలు కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తే కనుక తప్పకుండా వీరికి భారీ స్థాయిలో క్రేజ్ పెరగడం ఖాయం అని చెప్పాలి. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమాలకు భారీ స్థాయిలో కలెక్షన్లు రావాలి అంటే తప్పకుండా కంటెంట్ తో అందరిని మెప్పించాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: