కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయిన చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్రమ్ తన కెరియర్ ప్రారంభం లో తెలుగు లో కూడా కొన్ని మూవీ లలో నటించాడు. అలా చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంత గానో అలరించాడు. ఆ తరువాత విక్రమ్ తమిళ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. అందులో భాగంగా విక్రమ్ ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి ఇప్పటికీ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే చియాన్ విక్రమ్ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. చియాన్ విక్రమ్ ఈ సంవత్సరం మొదట కోబ్రా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. అలాగే తాజాగా విక్రమ్ , మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
ఇది ఇలా ఉంటే విక్రమ్ తన తదుపరి మూవీ ని పా రంజిత్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ లో విక్రమ్ సరసన చిత్ర బృందం మొదటగా రష్మిక మందలను హీరోయిన్ గా తీసుకున్నట్లు , కొన్ని కారణాల వల్ల ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో మాళవిక మోహన్ ను చిత్ర బృందం విక్రమ్ సరసన హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.