కాంతార మ్యానియాలో అడ్రస్ వెతుక్కుంటున్న మంచు విష్ణు విశ్వక్ సేన్ !

Seetha Sailaja

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ విన్నా జనం ‘కాంతార’ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగు రాష్ట్రాలలో హవా ను క్రియేట్ చేస్తూ ఈసినిమాను రిలీజ్ చేసిన అల్లు అరవింద్ కు బంగారు కాసులు కురిపిస్తోంది. దీనితో ఈ సినిమా మ్యానియా మరొక వారం రోజులు కొనసాగి ఆమ్యానియాలో దీపావళి కి రిలీజ్ కాబోతున్న విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ మంచు విష్ణు ‘జిన్నా’ మూవీలు కొంతవరకు దెబ్బతింటాయ అన్న ప్రచారం జరుగుతోంది.


దీనికి కారణం ఈ రెండు సినిమాల పై చెప్పుకోతగ్గ స్థాయిలో సగటు ప్రేక్షకులలో క్రేజ్ లేకపోవడమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజమండ్రిలో జరిగిన ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ అతిధిగా వచ్చినప్పటికీ జనం పెద్దగా పట్టించుకోలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఇక చరణ్ విశ్వక్ సేన్ ను ఏకంగా రజనీకాంత్ పవన్ కళ్యాణ్‌ ల పర్సనాల్టితో కంపేర్ చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలుగచేసింది.


అదేవిధంగా సంచలనాలకు చిరునామాగా ఉండే మంచు ఫ్యామిలీ నిర్వహించిన ‘జిన్నా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎటువంటి ఉరుములు మెరుపులు లేకుండా సాదాగా జరగడంతో ఈ రెండు సినిమాల గురించి జనం పెద్దగా మాట్లాడుకోవడం లేదు. అదేవిధంగా ఇదే దీపావళికి రాబోతున్న కార్తి ‘సర్దార్’ శివకార్తికేయ ‘ప్రిన్స్’ సినిమాల పై కూడ పెద్దగా మ్యానియా కనిపించడం లేదు. వాస్తవానికి ఈదీపావళికి విడుదల కాబోతున్న ఈ నాలుగు సినిమాలు ఆ సినిమాల హీరోల కెరియర్ కు అత్యంత కీలకంగా మారాయి.


ప్రస్తుతం ఈ నాలుగు సినిమాలలో నటించిన ఈ నలుగురు హీరోలు పరాజయాల బాటలో కొనసాగుతున్నారు. దీనితో ఈ నలుగురు కి సక్సస్ కావాలి. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు అంతా ‘కాంతార’ మ్యానియాలో ఉండటంతో ఎంతవరకు ఈ నాలుగు సినిమాలను ప్రేక్షకులు పట్టించుకుంటారు అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: