
అఖండతో పెరిగి పోయిన బాలయ్య రేంజ్...!!
ఇక రాబోయే రోజుల్లో అయితే బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నట్లు అనిపిస్తోంది. రాబోయే 107వ సినిమా మాత్రం అఖండ కంటే ఎక్కువ స్థాయిలోనే బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా ఎంత మేరకు బిజినెస్ చేయొచ్చు అనే వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి ఆయన కెరీర్ లోనే ఒక బెస్ట్ ఫిలిం గా నిలిచిందట.సింహా, లెజెండ్ సినిమాల తర్వాత దర్శకుడు బోయపాటి తెరపైకి తీసుకువచ్చిన ఆ సినిమా కాంబినేషన్ కు తగ్గట్టుగానే మంచి సక్సెస్ ను అందుకుంది. దాదాపు 55 కోట్ల వరకు బిజినెస్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద 69 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంది.
అయితే ఇప్పుడు అఖండ కంటే ఎక్కువ స్థాయిలోనే బాలకృష్ణ 107వ సినిమా బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా అభిమానుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తప్పకుండా సంక్రాంతికి ఫ్యాన్స్ కు నచ్చినట్లుగానే మాస్ ఫెస్టివల్ గానే ఈ మూవీ ఉంటుంది అని ఒక నమ్మకం అయితే ఏర్పడింది.
ఇక అఖండ కంటే ఎక్కువ స్థాయిలోనే నందమూరి బాలకృష్ణ 107వ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా నైజాం లో ఈ సినిమాకు మంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నిర్మాతలు చెబుతున్న ప్రకారం అయితే నైజం హక్కులు 20 కోట్లకి అమ్ముడు పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అఖండ సినిమా అయితే నైజంలో 10.5 కోట్లకు అమ్ముడుపోగా 19 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందించిందట.
ఇక సీడెడ్ లో కూడా బాలయ్య బాబు ఈసారి సరికొత్త రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ ఆయన ప్రతి సినిమా కూడా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అందుకుంటూ ఉంటాయి. అఖండ సినిమా థియేటర్లో పది కోట్ల వరకు బిజినెస్ చేయగా దాదాపు 17 షేర్ కలెక్షన్స్ అందించిందట.. ఇక ఇప్పుడు 107వ సినిమాకు సీడెడ్ ఏరియాలో 14 కోట్ల వరకు ధర పలికే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ఇక ఆంధ్ర మొత్తం కూడా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ సినిమా దాదాపు 35 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా మంచి ఆఫర్లు వస్తాయి అని డీల్స్ అయితే క్లోజ్ చేయలేదట. సంక్రాంతి విడుదల చేయాలని అనుకుంటున్న ఈ సినిమా బిజినెస్ మొత్తం కూడా దాదాపు 80 కోట్ల వరకు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి బాలయ్య 107వ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రాఫిట్స్ అందిస్తుందో మరీ చూడాలి.