బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ.. మ్యూజిక్ అందించిన తెలుగు సినిమాలు ఇవే?
సాదరణంగా ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏది కావాలో తెలియక కన్ఫ్యూజన్లో వచ్చాడో లేకపోతే అన్ని విభాగాలను ఏలాలి అనే క్లారిటీతో వచ్చాడో తెలియదు కానీ విజయ్ ఆంటోని సినిమా రంగంలో ఉన్న దాదాపు అని విభాగాలను టచ్ చేశాడు అని చెప్పాలి. ఇక ఆయన సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు అవార్డులు రివార్డులు సైతం అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఇక అతను ఎంత బాగా సంగీతం కొట్టగలడో.. అంత బాగా తన గాత్రంతో ప్రేక్షకులను మహిమరిపించగలడు అని ఇప్పటికే నిరూపించాడు.
2005లో మొదటిసారిగా ఒక సింగర్ గా సంగీత దర్శకుడిగా ఈ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్ ఆంటోనీ. ఇక ఆ తర్వాత ఏడాది తిరగకుండానే నటుడుగా ప్రస్థానం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ప్రతి ఏటా ఎన్ని సినిమాల్లో నటిస్తున్నాడో.. అన్ని సినిమాల్లో సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఇక దర్శకత్వంలో కూడా వెనకడుగు వేయడం లేదు. అయితే విజయ్ ఆంటోనీ తెలుగులో కూడా ఎన్నో సినిమాలుకు సంగీతం అందించాడు. ఆ విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియదు. ఇక విజయ్ ఆంటోని సంగీతం అందించిన సినిమాలు శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ, రవితేజ హీరోగా నటించిన దరువు సినిమాల్లో కూడా సంగీతం అందించాడు. అయితే దరువు సినిమాలో రెండు పాటలు కూడా పాడాడు విజయ్ ఆంటోని.