బాలయ్య షో కు రాలేనని చెప్పేసిన నాగార్జున...!!

murali krishna
నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరించిన టాక్ షో `అన్ స్టాపబుల్`. అన్ స్టాపబుల్ సీజన్ 1 ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం ఆహా ఇప్పుడు రెండో సీజన్ ను మొదలుపెట్టిందట.


అయితే మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసిన బాలయ్య.. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లో తన బావ నారా చంద్రబాబు నాయుడుని మరియు అల్లుడు లోకేష్ ని ఇంటర్వ్యూ చేశారట. ఇటీవల ఎపిసోడ్ 1 విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. తాజాగా ఎపిసోడ్ 2 ప్రోమో కూడా విడుదల అయినది.




అయితే గతంలో నందమూరి బాలకృష్ణ మరియు కింగ్ నాగార్జున మధ్య కొంత గ్యాప్ ఉందని వార్తలు కూడా వినిపించాయి. ప్రస్తుతం బాలకృష్ణ అన్ స్టాప్టబుల్ సీజన్ 2కి హోస్టుగా మరియు బిగ్ బాస్ సీజన్ 6కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నా.. బాలయ్య మాత్రం ఈ షోకు ఎప్పుడు హాజరు కాలేదన్న విషయం lతెలిసిందే.



అయితే అన్ స్టాపబుల్ సీజన్ 2 కి నాగార్జునని గెస్ట్ గా పిలవాలని ఈ షో నిర్వాహకులు చాలా ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఈ షో కోసం చిరంజీవిని సంప్రదించగా చిరంజీవి రావడానికి యస్ చెప్పారట.. కానీ నాగార్జున మాత్రం నో చెప్పారని సమాచారం. బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేసి అడిగినా నాగార్జున మాత్రం హాజరు కాలేనని సున్నితంగా నో చెప్పినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ నాగార్జున ఈ షో కి హాజరైనట్టయితే బాలయ్య నుంచి అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉండడం కారణంగా నాగార్జున ఈ షోకు నో చెప్పినట్టు సమాచారం. బాలయ్య కు నో చెప్పి షాక్ ఇచ్చిన నాగార్జున పై అనేక కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనాప్పటికీ ఈ విషయంలో షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారో మరీ చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: