టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఇటీవల ఆయన నటించిన శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకుని జోష్ మీదున్నారు.అయితే ప్రస్తుతం ఈ న్యాచురల్ స్టార్ దసరా సినిమాలో నటిస్తున్నారు.కాగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల్వక ముందే మరో చిత్రాన్ని లైన్లో పెట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నాడని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది.ఇక దసరా చిత్రంతో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని, ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని లాంచ్ చేయనున్నాడని సమాచారం.అయితే మోహన్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇకపోతే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నాని వెంటనే సినిమాకు ఓకే చెప్పాడని, నాని కెరీర్లో మునుపెన్నడూ రాని డిఫ్రెంట్ స్టోరీ లైనప్‌తో ఈ సినిమా ఉండనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం దసరా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా తదనంతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇక ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో షూటింగ్ జరుపుకుంటోంది.కాగా ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోన్న విషయం తెలిసిందే..!!