ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..!!
కాగా ఇపుడు లీడ్ రోల్ చేస్తున్న ప్రభాస్ ఎప్పుడు డబ్బింగ్ చెప్పుకుంటున్నాడన్న అప్డేట్ బయటకు వచ్చిందట.పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) మైథలాజికల్ డ్రామా ప్రాజెక్ట్ ఆదిపురుష్ (Aadipurush) ఎప్పుడూ ఏదో ఒక వార్తతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న కృతిసనన్ ఇప్పటికే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టిందట.. కృతిసనన్ డబ్బింగ్ అప్డేట్ ఫొటో కూడా నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. కాగా ఇపుడు లీడ్ రోల్ చేస్తున్న ప్రభాస్ ఎప్పుడు డబ్బింగ్ చెప్పుకుంటున్నాడన్న అప్డేట్ బయటకు వచ్చింది.
తన పాత్రకు అక్టోబర్ 19 నుంచి డబ్బింగ్ చెప్పుకోవడం షురూ చేయబోతున్నాడట ప్రభాస్. అంతేకాదు దీనికి సంబంధించి టీం కూడా అధికారిక అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్టు టాక్. ఈ న్యూస్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవడం అయితే గ్యారంటీ. ఆదిపురుష్‌లో కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది. ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసుడి పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ యాక్టర్ సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవ్‌దత్తా నగే హనుమంతుడిగా నటిస్తున్నారుట.
హై వీఎఫ్ఎక్స్ టెక్నాలజీతో అత్యంత భారీ బడ్జెట్‌తో టీ సిరీస్, రెట్రోఫైల్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.ఆదిపురుష్‌కు సాచెట్-పరంపర మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆదిపురుష్ టీజర్ కు మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఈ చిత్రం 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్‌గా రిలీజ్ కానుందని సమాచారం .