అనుష్క పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గరికపాటి...!!
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన చిరంజీవి, గరికపాటి నరసింహా రావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది. చిరంజీవిని ఉద్దేశిస్తూ గరికపాటి చేసిన కామెంట్స్ తీవ్రమైన చర్చకు దారి తీశాయట.. మెగా అభిమానులు గరికపాటి తీరుని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
చిరంజీవి రావడంతో అక్కడున్న అభిమానులు ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. దీనితో ప్రవచనం చెబుతున్న గరికపాటికి అసహనం కలిగింది. చిరంజీవిగారు వెంటనే ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపు రావాలి. లేకుంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతారు. నాకు ఎలాంటి మొహమాటం లేదని చిరంజీవి ఫోటో షూట్ ఆపేయండి లేదా నాకు సెలవు ఇప్పించండి అంటూ మాట్లాడారట.
ప్రవచనాలు చెప్పే గరికపాటికి ఆ మాత్రం ఓపిక, సహనం లేకపోవడం ఏంటి అంటూ చిరంజీవి అభిమానులు విమర్శించారు. చిరంజీవి లాంటి వారు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుంది.. దానిని నిర్వాహకులు చక్కదిద్దాలి లేదా ఓపికగా ఉండాలి అంటూ గరికపాటికి చురకలు అంటించారట.
ఈ వివాదంలో గరికపాటి తీరుని వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా తప్పుబట్టారు. గరికపాటిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఆర్జీవీ వరుస పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా వర్మ.. గరికపాటి నరసింహారావుపై మరో సెటైరికల్ పోస్ట్ వేశారు. ఈ పోస్ట్గ లో రికపాటి గతంలో అనుష్క అందం గురించి కొంటెగా చెబుతున్న వీడియో జత చేసారు.
ఈ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. హీరోయిన్లని కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని అనుకునేవాడిని. కానీ నా చూపు కూడా ఒక చోట ఆగింది. అది ఎవరంటే మహానటి అనుష్క. ఒక మంచి స్టిల్ లో అనుష్క ఫోటో పేపర్ లో ఉంది. మా అబ్బాయితో పాటు నేను కూడా చూస్తూ ఉండిపోయా అంటూ గరికపాటి కొంటెగా అనుష్క అందం గురించి ప్రస్తావించారు.