రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లో ఒక మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని మారుతి కూడా ధృవీకరించాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ని మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు, ఈ మూవీ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు , ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఒక సెట్ లోనే జరగనున్నట్లు , అందుకోసమని భారీ బడ్జెట్ తో మూవీ యూనిట్ ప్రత్యేకంగా ఒక సెట్ ను నిర్మిస్తున్నట్టు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.
కాక పోతే ఈ వార్తలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు మారుతి , ప్రభాస్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మారుతి , ప్రభాస్ సినిమా కోసం అద్భుతమైన నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. మారుతి , ప్రభాస్ కోసం రెడీ చేసిన కథలో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు , అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ ఇద్దరు హీరోయిన్ లను ఫైనల్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది.
ప్రభాస్ సరసన నటించడానికి నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహన్ లను సంప్రదించగా మారుతి ఇప్పటికే ఈ ఇద్దరు కూడా ప్రభాస్ మూవీ లో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో బాలీవుడ్ క్రేజీ నటుడు సంజయ్ దత్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మారుతి , ప్రభాస్ మూవీ కోసం అద్భుతమైన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.