ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న గోపి చంద్..!!

murali krishna
మ్యాచో స్టార్ గోపీచంద్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోల లిస్టులో గోపీచంద్ కూడా ఉన్నారు.


ఈయన హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. తన లాస్ట్ సినిమా పక్కా కమర్షియల్..


గోపీచంద్ సీటిమార్ సినిమా హిట్ తర్వాత మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేసాడు. అయితే సీటిమార్ తో హిట్ అందుకున్న ఈ స్టార్ పక్కా కమర్షియల్ తో యావరేజ్ సినిమా అనిపించు కున్నాడు. ప్రెజెంట్ గోపీచంద్ లక్ష్యం హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈసారి కూడా మరో హిట్ ఇస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఇటీవలే దసరా పండుగ సందర్భంగా శ్రీను వైట్లతో మరో సినిమా ప్రకటించాడు.


వీరి కాంబోలో సినిమా ప్రకటించడంతో అంచనాలు పెరిగి పోయాయి.. ఇక గోపీచంద్ చేతిలో సినిమాలు ఉండగానే ఈయన మరో సినిమా చేయబోతున్నాడు అంటూ తాజాగా వార్తలు వస్తున్నాయి.. అది కూడా తమిళ్ స్టార్ డైరెక్టర్ తో అని తెలుస్తుంది. తమిళ్ స్టార్ డైరెక్టర్ హరి ఒక పవర్ ఫుల్ కథతో గోపీచంద్ తో సినిమా చేయబోతున్నాడని.. ఈ యాక్షన్ కథకు ఆ డైరెక్టర్ గోపీచంద్ ను ఎంచుకున్నాడని తెలుస్తుంది.


  ఇప్పటికే హరి గోపీచంద్ కు కథ కూడా చెప్పాడని.. గోపీచంద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు కూడా వస్తున్నాయి. అన్ని ఓకే అయితే నెక్స్ట్ ఇయర్ నే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది అటు.. ఇక మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రముఖ నిర్మాణ సంస్థ లేక ప్రొడక్షన్స్ నే గోపీచంద్ ను హరి కాంబోను సెట్ చేసింది అని టాక్.. మరి చూడబోతే హరి మంచి పవర్ కథతోనే రాబోతున్నాడు అనిపిస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో అయినా గోపీచంద్ కు పూర్వ వైభవం వస్తుందో లేదో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: