టాలీవుడ్ సీనియర్ హీరోలు అందరూ కలిసి నటించిన. సినిమా ఏంటో తెలుసా....!!!
ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో వరుస మల్టీస్టారర్ సినిమాలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ మల్టీ స్టార్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే ఇప్పుడున్న సీనియర్ హీరోలు అందరూ ఒక సినిమాలో కలిసి నటించారట. టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి సీని యర్ హీరోలు అందరూ ఒక సినిమాలో కలిసి నటించారట. వీరితోపాటు ఆ టైంలో స్టార్ హీరోయిన్‌లగా కొనసాగుతున్న హీరోయిన్లు కూడా ఆ సినిమాలో కనిపించారట.ఆ సినిమా ఏమిటంటే 1987లో వెంకటేష్ హీరోగా వచ్చిన త్రిమూర్తులు సినిమా లో ఒక పాటలో వీరంతా కలిసి నటించారు. వారు ఈ సినిమాలో నటించడానికి వెంకటేష్ తండ్రి రామానాయుడు వాళ్ళందరిని ఓపించారట. ఆయన మాట కాదన లేక వారందరూ ఆ పాటలో కలిసి నటించారట. అప్పట్లో ఈ క్రేజీ మల్టీస్టారర్ సాంగ్ టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.