హీరో ధనుష్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా..!!
అలా ఆ సినిమాలను మలిచాడు. ఇక ఈయన లవ్ స్టోరీ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా కరోనా తర్వాత వచ్చిన మంచి హిట్ అందుకుని ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించింది.ఇక కమ్ముల ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేసాడు.. మరి ఇలాంటి హిట్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ హీరోను లైన్లో పెట్టాడు.. అంట మరి, కొన్ని నెలల క్రితం ధనుష్ హీరోగా నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు.. కానీ ఈ మధ్య ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.. ప్రకటించి చాలా రోజులు అవుతున్న ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇంకా బయటకు రాకపోవడంతో ఈ సినిమా వాయిదా పడినట్టే అని తెలిపారు.
ధనుష్ ఈ సినిమాను క్యాన్సిల్ చేసాడని.. మరో డైరెక్టర్ తో సినిమా ప్రకటించ బోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి.. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమా ఆగిపోలేదట.. ఇంకా చర్చల దశలోనే ఉంది అని ప్రెజెంట్ ధనుష్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతనే శేఖర్ కమ్ముల సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందట.. ఈ ఏడాది చివర్లో ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రాబోతుందట.. దీంతో కమ్ముల ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి మరి.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 1950 నాటి ఆంధ్రా, తమిళ్ నాడు మధ్య ఉన్న సంబంధాల మధ్య రాబోతుంది అని దీనిని భారీ పీరియాడిక్ డ్రామాగా చూపించ బోతున్నారు అంటూ మనకు తెలుస్తుంది.. తమిళ్ నాడులో ఉండే తెలుగు కుర్రాడి పాత్రలో ధనుష్ కనిపిస్తాడట.. ఈ సినిమాకు భారీ బడ్జెట్ మాత్రమే కాదు.. ఎక్కువ సమయం కూడా కేటాయించాల్సి వస్తుందట.. మరి ఈ ప్రాజెక్ట్ మళ్ళీ అధికారిక ప్రకటన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ధనుష్ తెలుగులోనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే సినిమా ను చేస్తున్నాడు.