బారి అంచనాల తో రానున్న పుష్ప-2 సినిమా..!!

murali krishna
లీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప ది రూల్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో  మన అందరికీ తెలిసిందే.

ఈ పాన్ ఇండియా మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ  కూడా సాధించాడు. అయితే.. ఈ మూవీ మొదటి భాగంలో విలన్‌గా ఫహాద్ ఫాజిల్) నటించాడు. అల్లు అర్జున్‌లాగే ఈ నటుడికి కూడా మంచి పాపులారిటీ వచ్చింది. కాగా.. ఈ మూవీ సెకండ్ పార్ట్ 'పుష్ప ' కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ తరుణంలో.. ఈ మూవీలో విలన్ పాత్ర గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్రలో విలన్‌గా విజయ్ సేతుపతి చేయనున్నాడని వార్తలు వినిపించాయి. అయితే.. వాటిని సేతుపతి పీఆర్ టీం కొట్టిపడేసింది. తాజాగా మరో క్రేజీ రూమర్ ఈ పాత్ర గురించి హల్‌చల్ చేస్తుంది. ఫహాద్ ఫాజిల్ పాత్రని బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్ చేయనున్నాడనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ రుమార్‌పై తాజాగా పుష్ప నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేనీ స్పందించాడు.

నవీన్ మాట్లాడుతూ.. 'ఫహద్ ఫాసిల్‌యే ఈ పాత్రని చేస్తున్నాడు. కాబట్టి ఇది వంద శాతం అది తప్పుడు వార్త. మేము ఈ నెలాఖరు నుంచి (పుష్ప పార్ట్ టూ కోసం) షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ నెల 20 నుంచి 30 మధ్య షూట్ స్టార్ట్ చేస్తాం. మొదట్లో హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తా. అడవికి, ఇతర లొకేషన్లకు వెళతాం' అని చెప్పుకొచ్చాడు. కాగా.. మొదటి పార్ట్‌లో లెబర్‌గా నటించిన అర్జున్‌.. 'పుష్ప 2'లో మాత్రం డాన్‌గా నటించనున్నాడు అని చిత్రం యూనిట్ సభ్యులు పేర్కొన్నారు . దీంతో ఆయన కొత్త లుక్‌ని ఫైనల్ చేసేందుకు మూవీ టీం  నానా ప్రయత్నాలు చేస్తోంది. అది పూర్తయితే త్వరలోనే ఈ మూవీ పట్టాలు ఎక్కనుంది అంటా మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: