నిర్మాత రామలింగేశ్వరరావు ని చెప్పుతో తంటా అంటున్న పృథ్వీ..!!
పెళ్లి సినిమా కు బెస్ట్ యాక్టర్ గా తనకు నంది అవార్డ్ వచ్చిందని పృథ్వీ పేర్కొన్నారు. మెయిన్ రోల్స్ లో నటించి సినిమా సక్సెస్ సాధించకపోతే పరిస్థితి ఏంటని నాకు భయ మని పృథ్వీ వెల్లడించడం గమనార్హం.
నేను ఒకటి రెండు సినిమాల్లోనే మెయిల్ రోల్స్ లో నటించానని అయితే ఆ సినిమాలు విడుదలై ఫ్లాపయ్యాయని ఆయన అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తే నా వల్లే సినిమా ఫ్లాప్ అయిందని ఎవరూ అనరని ఆయన చెప్పుకొచ్చారు. పెళ్లి సినిమాకు ముందే ఈ నిర్ణయం తీసుకున్నానని పృథ్వీ తెలిపారు. నేను, నాజర్, రఘువరన్ ఒకే బ్యాచ్ అని పృథ్వీ అన్నారు. కుట్టి పద్మిని గారు నాకు అవకాశాలు ఇప్పించారని పృథ్వీ చెప్పుకొచ్చారు.
మేనేజర్ ఎంపికలో తప్పు వల్ల 16 నుంచి 20 సినిమాలు పోయాయని పృథ్వీ తెలిపారు. నేను టీవీ ప్రోగ్రామ్స్ లో చేయడం వల్ల సినిమా ఆఫర్లను చాలా కోల్పోయానని పృథ్వీ కామెంట్లు చేశారు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్బాలచందర్, మణిరత్నం అని గొంతు మార్చి కాల్ చేసి ఇబ్బంది పెట్టేవాడని పృథ్వీ చెప్పుకొచ్చారు. ఒకరోజు ప్రొడ్యూసర్ రామలింగేశ్వరరావు కాల్ చేయగా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ చేశాడని అనుకుని చెప్పుతో కొడతా అన్నానని పృథ్వీ కామెంట్లు చేశారు.
బబ్లూ పృథ్వీరాజ్ మీరే కదా అని ఆయన అడగటంతో అప్పుడు ఆయన గొంతు గుర్తు పట్టి సారీ చెప్పానని పృథ్వీ వెల్లడించారు. ఆ సమయంలోనే పెళ్లి సినిమా లో నాకూ అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. చెప్పుతో కొడతా అని పొరపాటుగా అన్నప్పటికీ నిర్మాత రామలింగేశ్వరరావు అర్థం చేసుకున్నారని పృథ్వీ చెప్పుకొచ్చారు.