విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ఖుషి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన క్లాసిక్ హిట్ సినిమా టైటిల్ ఖుషి ని విజయ్ దేవరకొండ సినిమాకు పెట్టడంతోనే ఒకసారిగా ఈ సినిమా పట్ల అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. పవన్ అభిమానులు కొంతవరకు ఈ టైటిల్ను పెట్టడం పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచారు. మెగా హీరోలు కాకుండా ఇతర హీరో ఈ సినిమా టైటిల్ను పెట్టుకోవడంతో వారు చాలాసార్లు అసహనాన్ని వ్యక్తపరిచారు. చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా వారు కనబరిచి ఒక్కసారిగా సినిమా పట్ల అంచనాలను పెంచేశారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఎంతగానో ఉంది. అలా ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదల అవుతుందని ప్రకటించగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ సినిమా ఆ తేదీన విడుదలవడం చాలా కష్టం అని తెలుస్తుంది. కారణం ఏదైనా కూడా ఇంతటి మోస్ట్ అవైటెడ్ సినిమా పెండింగ్ లో పడిపోవడం నిజంగా విజయ్ దేవరకొండ అభిమానులను మాత్రమే కాదు ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని కూడా ఎంతగానో నిరాశపరిచే విషయం అనే చెప్పాలి.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం సమంత డేట్లు దొరకకపోవడంతోనే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది ఇంకొక వైపు సమంత అనారోగ్యానికి గురి కావడంతో ఈ సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండిటిలో ఎందుకో నిజం ఉందో తెలియాల్సి ఉంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేమికులను ఎంతగానో మెప్పిస్తుందట.. ప్రేమ కథ సినిమాలను ఎంతో బాగా డీల్ చేసే దర్శకుడైన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తున్నాడు.