గాడ్ ఫాదర్ ను గట్టెక్కించిన ఆచార్య అనుభవాలు !

Seetha Sailaja

దసరా నాడు విడుదలైన ‘గాడ్ ఫాదర్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ టాక్ స్థాయిలో మొదటిరోజు సంతృప్తిగా రాకపోవడంతో ఈమూవీ నిర్మాతలు టెన్షన్ పడ్డారు. అయితే ఈమూవీ విడుదలైన రెండవరోజు నుండి పరిస్థితి మారి కలక్షన్స్ పుంజుకావడంతో ఈమూవీ నిర్మాతలతో పాటు మెగా కాంపౌండ్ కూడ తెరిపిన పడినట్లు వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి ఈ మూవీ విడుదల ముందు ‘ఆచార్య’ అనుభవాలతో ఈమూవీ నిర్మాతలు చాల జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ‘ఆచార్య’ మూవీల ‘గాడ్ ఫాదర్’ మూవీని అత్యంత భారీ రేట్లకు అమ్మలేదు. అంతేకాదు ఈ మూవీ బయ్యర్లు ఎక్కడా నష్టపోకూడదు అన్న ఉద్దేశ్యంతో తెలుగు రాష్ట్రాలలోని కొన్ని కీలక ఏరియాలలో కేవలం అడ్వాన్స్ ల మీద విడుదల చేసారు అన్న మాటలు కూడ వినిపించాయి.


ఆ అడ్వాన్స్ లు కూడ భారీ స్థాయిలో లేకుండా కొంతవరకు మీడియం రేంజ్ లో బయ్యర్ల దగ్గర నుండి తీసుకున్నారు అన్న వార్తలు కూడ వచ్చాయి. అంతేకాదు ఈ మూవీని ‘ఆచార్య’ మాదిరిగా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ధియేటర్లలో విడుదల చేయకపోవడం టిక్కెట్ ధరను విపరీతంగా పెంచకపోవడం కూడ ‘గాడ్ ఫాదర్’ కలక్షన్స్ పుంజుకోవడానికి మరొక కారణం అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ‘గాడ్ ఫాదర్’ కలక్షన్స్ రెండవరోజు నుండి మేరుగావ్వడంతో ఈ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అంటూ మెగా అభిమానులు వారివారి స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు.

‘ఆచార్య’ ఫెయిల్యూర్ చిరంజీవికి విపరీతంగా షాక్ ఇచ్చింది అని అంటారు. వాస్తవానికి చిరంజీవి కెరియర్ లో ఎన్నో ఫెయిల్యూర్ లను చూసాడు. అయితే ‘ఆచార్య’ రిజల్ట్ పై ఆయన మధనపడినంతగా మరే సినిమా గురించి మధనపడలేదు అంటారు. చిరంజీవి నటించిన సినిమాలలో హీరోయిన్ లేకుండా సక్సస్ వచ్చిన ఏకైక సినిమాగా ‘గాడ్ ఫాదర్’ రికార్డ్ ను క్రియేట్ చేస్తోంది. ఇలాంటి పరిణామాలతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: