కలెక్షన్స్ దుమ్ము దులుపుతున్న గాడ్ ఫాదర్....!!
ప్రీమియర్ షోస్ కి ఈ సినిమాకి కేవలం 3 లక్షల 40 వేల డాలర్స్ మాత్రమే వచ్చాయి..సరైన ప్లానింగ్ తో విడుదల చెయ్యకపోవడం వల్లే ఈ దెబ్బ పడింది..కానీ ఆ తర్వాత మొదటి రోజు నుండి ఇప్పటి వరుకు ఈ సినిమా స్టడీ వసూళ్లను రాబడుతూ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే దిశగా అడుగులు వేస్తుంది..మొదటి రోజు 1 లక్ష 65 వేల డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం, రెండవ రోజు 1 లక్ష 30 వేలు వసూలు చేసిందట...మొత్తం మీద ప్రీమియర్స్ + మొదటి రెండు రోజులు కలిపి ఈ సినిమా 6 లక్షలకు పైగా డాలర్లు వసూలు చేసింది..ఇక మూడవ రోజు అనగా శుక్రవారం రోజు అడ్వాన్స్ సేల్స్ మొదటి రోజు కంటే ఎక్కువ ఉండడం విశేషం..మూడవ రోజు ఈ సినిమా ఇక్కడ రెండు లక్షలకు పైగా డాలర్స్ వసూలు చేసే అవకాశం అయితే ఉంది.
ఇక శనివారం రోజు అయితే ఈ సినిమా 5 లక్షల డాలర్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు..ఆలా ఈ లాంగ్ వీకెండ్ మొత్తం కలిపి ఈ సినిమా 14 లక్షల డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందట..ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 16 లక్షల డాలర్లు వసూలు చెయ్యాల్సిన అవసరం ఉంది..లిమిటెడ్ రిలీజ్ మీద అవలీల గా వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని కి 98 శాతం రీచ్ అవ్వడం అంటే మాములు విషయం కాదు..లాంగ్ రన్ లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్స్ మార్కుని అందుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.